AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల మాడ వీధుల చరిత్ర ఏమిటి? వాటికి ఆ పేరు ఎలా వచ్చింది? ప్రత్యేకతలు తెలుసుకోండి!

Tirumala Mada Streets: కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీనివాసుడు వెలసిన పవిత్ర క్షేత్రం తిరుమలను భూలోక వైకుంఠంగా పిలుస్తారు. ఇక్కడ అర్చావతార రూపంలో శ్రీనివాసుడు దర్శనమిచ్చే గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. ఆనంద నిలయాన్ని చుట్టుముట్టి ఉన్న నాలుగు ప్రధాన వీధులనే “మాడ వీధులు” అని అంటారు. ఈ వీధుల ప్రాముఖ్యతలు, విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Apr 21, 2026 | 10:43 AM

Share
కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీనివాసుడు వెలసిన పవిత్ర క్షేత్రం తిరుమలను భూలోక వైకుంఠంగా పిలుస్తారు. ఇక్కడ   అర్చావతార రూపంలో శ్రీనివాసుడు దర్శనమిచ్చే గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. ఈ ఆలయాన్ని చుట్టుముట్టి ఉన్న నాలుగు ప్రధాన వీధులనే “మాడ వీధులు” అని వ్యవహరిస్తారు. ఈ వీధుల్లోనే ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక ఉత్సవాల్లో మలయప్పస్వామి తన దేవేరులతో కలిసి ఊరేగుతాడు. ఈ పవిత్ర వీధుల్లో భక్తులు మాత్రమే కాదు, అర్చకులు కూడా పాదరక్షలు ధరించకుండా నడవడం సంప్రదాయం. ఈ మాడ వీధులకు ఇంతటి పవిత్రత ఎలా వచ్చింది? వాటి నేపథ్యం ఏమిటి? చూద్దాం.

కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీనివాసుడు వెలసిన పవిత్ర క్షేత్రం తిరుమలను భూలోక వైకుంఠంగా పిలుస్తారు. ఇక్కడ అర్చావతార రూపంలో శ్రీనివాసుడు దర్శనమిచ్చే గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. ఈ ఆలయాన్ని చుట్టుముట్టి ఉన్న నాలుగు ప్రధాన వీధులనే “మాడ వీధులు” అని వ్యవహరిస్తారు. ఈ వీధుల్లోనే ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక ఉత్సవాల్లో మలయప్పస్వామి తన దేవేరులతో కలిసి ఊరేగుతాడు. ఈ పవిత్ర వీధుల్లో భక్తులు మాత్రమే కాదు, అర్చకులు కూడా పాదరక్షలు ధరించకుండా నడవడం సంప్రదాయం. ఈ మాడ వీధులకు ఇంతటి పవిత్రత ఎలా వచ్చింది? వాటి నేపథ్యం ఏమిటి? చూద్దాం.

1 / 5

“మాడ వీధులు” పేరు ఎలా వచ్చింది?..  

తమిళ సంప్రదాయంలో ఆలయ పరిసరాల్లో అర్చకులు నివసించే ఇళ్లతో ఉన్న వీధులను “మాడం” అని పిలిచేవారు. ద్రావిడ సంప్రదాయం ప్రభావం ఉన్న తిరుమలలో ఈ పదం కాలక్రమేణా మారి “మాడ వీధులు”గా స్థిరపడింది.

“మాడ వీధులు” పేరు ఎలా వచ్చింది?.. తమిళ సంప్రదాయంలో ఆలయ పరిసరాల్లో అర్చకులు నివసించే ఇళ్లతో ఉన్న వీధులను “మాడం” అని పిలిచేవారు. ద్రావిడ సంప్రదాయం ప్రభావం ఉన్న తిరుమలలో ఈ పదం కాలక్రమేణా మారి “మాడ వీధులు”గా స్థిరపడింది.

2 / 5

మాడ వీధుల చారిత్రక నేపథ్యం.. 

పూర్వకాలంలో ఆలయం చుట్టూ ఊరేగింపులకు అనువైన వీధులు సరిపడా ఉండేవి కావు. అందుకే కొన్ని ఉత్సవాలు ఇతర ప్రదేశాల్లో నిర్వహించాల్సి వచ్చేది. తరువాత శ్రీ రామానుజాచార్యుల వారు ఆలయ చుట్టూ సరైన వీధుల వ్యవస్థను ఏర్పాటు చేయించారు. ఆ తరువాత కాలంలో వీటిని మరింత విస్తరించి, ఆధునికంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కనిపిస్తున్న మాడ వీధులు అదే రూపాంతరం. 

నాలుగు వేదాల ప్రతీకగా నాలుగు వీధులు.. 

తిరుమల ఆలయాన్ని చుట్టుముట్టే నాలుగు మాడ వీధులను నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ భావన వల్ల వీటికి మరింత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏర్పడింది.

మాడ వీధుల చారిత్రక నేపథ్యం.. పూర్వకాలంలో ఆలయం చుట్టూ ఊరేగింపులకు అనువైన వీధులు సరిపడా ఉండేవి కావు. అందుకే కొన్ని ఉత్సవాలు ఇతర ప్రదేశాల్లో నిర్వహించాల్సి వచ్చేది. తరువాత శ్రీ రామానుజాచార్యుల వారు ఆలయ చుట్టూ సరైన వీధుల వ్యవస్థను ఏర్పాటు చేయించారు. ఆ తరువాత కాలంలో వీటిని మరింత విస్తరించి, ఆధునికంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కనిపిస్తున్న మాడ వీధులు అదే రూపాంతరం. నాలుగు వేదాల ప్రతీకగా నాలుగు వీధులు.. తిరుమల ఆలయాన్ని చుట్టుముట్టే నాలుగు మాడ వీధులను నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ భావన వల్ల వీటికి మరింత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏర్పడింది.

3 / 5
తూర్పు మాడ వీధి.. 

ఆలయానికి ఎదురుగా ఉండే ఈ వీధి పుష్కరిణి వరకు విస్తరించి ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ కొయ్య రథం నిలిపే ప్రదేశం కూడా ఉండేది. సన్నిధి వీధి, గొల్ల మండపం, బేడి ఆంజనేయస్వామి ఆలయం వంటి చారిత్రక స్థలాలు ఇక్కడ ఉండేవి. కాలక్రమేణా అనేక పురాతన నిర్మాణాలు అభివృద్ధి పనుల్లో మార్పులకు గురయ్యాయి.

దక్షిణ మాడ వీధి.. 

ఆలయానికి కుడివైపున ఉన్న ఈ వీధిలో తిరుమల నంబి ఆలయం ప్రధానంగా ఉంటుంది. ఒకప్పుడు రాజుల గుర్రాలను కట్టే స్థలం కూడా ఇక్కడ ఉండేదని చెబుతారు. ఊంజల్ మండపం, ఉగ్రాణం వంటి ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఈ వీధి పరిధిలోనే ఉన్నాయి. ఉత్సవాల సమయంలో ఊంజల్ సేవ ఇక్కడే నిర్వహించేవారు. 
పడమర మాడ వీధి.. 

ఆలయ వెనుక భాగంలో ఉన్న ఈ వీధిలో పూర్వకాలంలో అనేక మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం కూడా కొన్ని మఠాలు,    మండపాలు ఇక్కడ ఉన్నాయి. అనంతాళ్వార్ తోట వంటి పవిత్ర ప్రదేశాలు ఈ వీధి ప్రారంభంలో కనిపిస్తాయి.

ఉత్తర మాడ వీధి.. 

ఆలయానికి ఎడమ వైపున ఉన్న ఈ వీధి అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలది. ఇక్కడే స్వామి పుష్కరిణి, వరాహ స్వామి ఆలయం వంటి ముఖ్య స్థలాలు ఉన్నాయి. భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించడం సంప్రదాయం. పూర్వకాల భక్తులు తరిగొండ వెంగమాంబ వంటి మహాభక్తులు కూడా ఇక్కడే నివసించినట్టు చరిత్ర చెబుతుంది.

తూర్పు మాడ వీధి.. ఆలయానికి ఎదురుగా ఉండే ఈ వీధి పుష్కరిణి వరకు విస్తరించి ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ కొయ్య రథం నిలిపే ప్రదేశం కూడా ఉండేది. సన్నిధి వీధి, గొల్ల మండపం, బేడి ఆంజనేయస్వామి ఆలయం వంటి చారిత్రక స్థలాలు ఇక్కడ ఉండేవి. కాలక్రమేణా అనేక పురాతన నిర్మాణాలు అభివృద్ధి పనుల్లో మార్పులకు గురయ్యాయి. దక్షిణ మాడ వీధి.. ఆలయానికి కుడివైపున ఉన్న ఈ వీధిలో తిరుమల నంబి ఆలయం ప్రధానంగా ఉంటుంది. ఒకప్పుడు రాజుల గుర్రాలను కట్టే స్థలం కూడా ఇక్కడ ఉండేదని చెబుతారు. ఊంజల్ మండపం, ఉగ్రాణం వంటి ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఈ వీధి పరిధిలోనే ఉన్నాయి. ఉత్సవాల సమయంలో ఊంజల్ సేవ ఇక్కడే నిర్వహించేవారు. పడమర మాడ వీధి.. ఆలయ వెనుక భాగంలో ఉన్న ఈ వీధిలో పూర్వకాలంలో అనేక మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం కూడా కొన్ని మఠాలు, మండపాలు ఇక్కడ ఉన్నాయి. అనంతాళ్వార్ తోట వంటి పవిత్ర ప్రదేశాలు ఈ వీధి ప్రారంభంలో కనిపిస్తాయి. ఉత్తర మాడ వీధి.. ఆలయానికి ఎడమ వైపున ఉన్న ఈ వీధి అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలది. ఇక్కడే స్వామి పుష్కరిణి, వరాహ స్వామి ఆలయం వంటి ముఖ్య స్థలాలు ఉన్నాయి. భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించడం సంప్రదాయం. పూర్వకాల భక్తులు తరిగొండ వెంగమాంబ వంటి మహాభక్తులు కూడా ఇక్కడే నివసించినట్టు చరిత్ర చెబుతుంది.

4 / 5
మహా ప్రదక్షిణం.. 

ఈ నాలుగు మాడ వీధులను చుట్టూ చేసే ప్రదక్షిణను “మహా ప్రదక్షిణం” అంటారు. దర్శనం లభించని సందర్భాల్లో ఈ ప్రదక్షిణను మూడు సార్లు చేయడం వల్ల శ్రీవారి దర్శన ఫలితం లభిస్తుందని ఆగమ శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ విధంగా మాడ వీధులు కేవలం భౌగోళిక మార్గాలు మాత్రమే కాకుండా, ఆధ్యాత్మికత, చరిత్ర, సంప్రదాయం కలిసిన పవిత్ర పరిధిగా తిరుమలలో ప్రత్యేక స్థానం పొందాయి.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. వివిధ వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

మహా ప్రదక్షిణం.. ఈ నాలుగు మాడ వీధులను చుట్టూ చేసే ప్రదక్షిణను “మహా ప్రదక్షిణం” అంటారు. దర్శనం లభించని సందర్భాల్లో ఈ ప్రదక్షిణను మూడు సార్లు చేయడం వల్ల శ్రీవారి దర్శన ఫలితం లభిస్తుందని ఆగమ శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ విధంగా మాడ వీధులు కేవలం భౌగోళిక మార్గాలు మాత్రమే కాకుండా, ఆధ్యాత్మికత, చరిత్ర, సంప్రదాయం కలిసిన పవిత్ర పరిధిగా తిరుమలలో ప్రత్యేక స్థానం పొందాయి. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. వివిధ వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

5 / 5
Follow Us