
హిందూ సంప్రదాయంలో మూడు రోజుల పాటు వివాహ తంతును జరిపిస్తారు. ఇక ఆచారంలో జీలకర్ర బెల్లం పెట్టి, మెడలో మూడు ముళ్లు వేస్తే చాలు వివాహం పూర్తి అయినట్లే. మంగళ సూత్రం వధువు మెడలో పడింది అంటే, ఆ అమ్మాయి, ఆ వరుడు జీవిత భాగస్వామి అయిపోయినట్లే. ఇక తాళి కట్టినప్పుడు మూడు ముళ్లు వేయడం కామన్. మూడు ముళ్లు వేస్తేనే వివాహం పూర్తి అవుతుంది. అయితే ఇలా మూడు ముళ్లు వేయడానికి అనేక కారణాలు ఉన్నాయంట. అందులో ఒకటి హిందూ సంప్రదాయంలో మూడు అనే సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా త్రిమూర్తులు, త్రిలోకాలు, త్రిగుణాలు, ఇళా అన్నీ మూడు ఉంటాయి. అంతే కాకుండా, ఒక వ్యక్తికి కూడా మూడు శరీరాలు ఉంటాయంట. ఆ మూడు శరీరాలు కలిసి మెలిసి ఉండాలని మూడు ముళ్లు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతే కాకుండా మరో కారణం కూడా ఉన్నదంట.

మూడు ముళ్లలో ఒక్కో ముడికి ఒక్కో అర్థం ఉందని చెబుతున్నారు పండితులు. కాగా, అసలు ఈ మూడు ముడుల అర్థం ఏంటి? వివాహ బంధంలో ఈ మూడు ముళ్ల ప్రత్యేకత, దాని గొప్పతనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మొదటి ముడి, తాళి కట్టే సమయంలో వేసే మొదటి ముడిని ధర్మేచ్ఛ అని అంటారంట. అంతే భార్య భర్తలు ఇద్దరూ ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మ మార్గంలో నడవాలి. ప్రతి పనిలో నిబద్ధతగా ఉంటూ ముందుకు సాగాలని అర్థం.

రెండవ ముడి, తాళి కట్టే సమయంలో రెండవ ముడిని, ఆర్తెచా అంటారు. ఇది కుటుంబ వృద్ధిని సూచిస్తుంది. దంపతులు ఇద్దరు, ఏ కష్ట సమయంలోనైనా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ, కష్టపడి కుటుంబాన్ని ఆనందంగా చూసుకోవాలి.

మూడవ ముడి, తాళికట్టే సమయంలో వేసే మూడవ ముడి భార్యభర్తల మధ్య ప్రేమను సూచిస్తుంది. అనురాగం, అప్యాయతలు, ప్రేమతో ఇద్దరూ నిండు నూరేళ్లు కలిసి జీవించాలి. వంశ వృద్ధి చేసి, కలకలం కష్టసుఖాల్లో పాలుపంచుకొని జీవించాలి,అని సూచిస్తుందంట. దాంపత్య జీవితానికి అర్థాన్ని ఇస్తుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు