Hasanamba Temple: ఏడాది తర్వాత తెరుచుకున్న హసనాంబ ఆలయం.. ఆరని దీపాన్ని దర్శించుకునేందుకు పోటెత్తిన ప్రముఖులు

|

Nov 03, 2023 | 12:50 PM

ఏడాది తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని హాసనాంబ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఈ రోజు నుంచి హాసనాంబ దేవి దర్శనానికి భక్తులను అనుమతించారు. మొదటి.. చివరి రోజు మినహా మిగిలిన 12 రోజుల్లో  ఉదయం 6 గంటల నుండి హాసనాంబ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. హాసనాంబ దర్శనానికి వచ్చే భక్తుల కోసం హాసన్ జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది.

1 / 7
శక్తి దేవత అయిన హాసన్ స్థానికులకు మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలకు ఆరాధ్యదైవం. ఏడాది కోసారి దర్శనంతో తనను కొలిచే భక్తులను కరుణించే హాసనాంబ దర్శన భాగ్యం మళ్ళీ ఏడాది తర్వాత భక్తులకు దొరికింది. హాసన్ జిల్లా ఇన్‌చార్జి కెఎన్ రాజన్న సమక్షంలో నిర్మలానందనాథ్ స్వామీజీ, ప్రధాన అర్చకుడు నాగరాజ్ నేతృత్వంలో హాసనాంబ ఆలయ గర్భగుడిని మధ్యాహ్నం 12:23 గంటలకు తెరిచారు. 

2 / 7
అమ్మవారి ఆలయ తలపులను పూజారి తీసిన సమయంలో గర్భగుడిలోని ఆరని జ్యోతిని ప్రముఖులు దర్శించుకున్నారు. అమ్మవారి తలపులు వేసే ముందు అంటే ఏడాది క్రితం వెలిగించిన దీపం వెలుగుతూనే ఉంటుంది. అప్పుడు పెట్టిన పువ్వు వాడిపోదు. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ అమ్మవారి ఆలయ తలపులు తెరచిన సమయంలో దర్శనం ఇచ్చాయి.  

3 / 7
ఏడాదికి ఒకసారి అమ్మవారి ఆలయం లో దేవతకు నెయ్యి దీపం వెలిగించి, పువ్వులు, నీరు, రెండు బస్తాల అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. అవి మళ్ళీ ఏడాది తర్వాత తలుపులు తెరచే వరకూ ఫ్రెష్ గా ఉంటాయి. ఆలయం తలుపు మూసివేసి సమయంలో దీపం వెలుగుతూనే ఉంటుంది. నెయ్యి తరగదు. తలుపులు తిరిగి తెరిచినప్పుడు అన్నం ప్రసాదం వెచ్చగా..  చెడిపోకుండా ఉంటుంది. 

4 / 7
14 రోజుల పాటు అమ్మవారి దర్శనం ఇవ్వనుండడంతో హాసనాంబే జాతర ఉత్కంఠకు తెరపడింది. వివిధ రకాల పూలతో.. చెరకు, మొక్కజొన్న, కొబ్బరికాయలతో పూజా మందిరాన్ని అలంకరించారు. భక్తులు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.  

5 / 7
హాసనాంబే సన్నిధిని వివిధ పుష్పాలంకరణలతో అలంకరించారు. ఎలక్ట్రిక్ షాన్డిలియర్లు మరింత అందని ఇస్తాయి. నేటి నుంచి 14 రోజుల పాటు హాసనాంబే ఉత్సవాలు జరగనున్నాయి. ఈసారి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

6 / 7
 దాదాపు 10 కిలోమీటర్ల మేర బారికేడ్‌ ఏర్పాటు చేశారు. 24 గంటలూ అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఈసారి వీఐపీ, వీవీఐపీ, ప్రత్యేక ప్రత్యక్ష దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

7 / 7
భక్తుల సౌకర్యార్థం క్యూఆర్ కోడ్ వ్యవస్థతోపాటు విరాళాలు ఇచ్చేందుకు ఈ-ఫండ్ కూడా ఏర్పాటు చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీ, హెలీ టూరిజం వ్యవస్థ కూడా ఉంది.  