
ప్రస్తుతం గురు చండాల దోషంతో మూడు రాశుల వారు ప్రభావితం అవుతున్నారు. అయితే అక్టోబర్ నెల చివరి వరకు రాహువు, గురు గ్రహాలు రెండు కలయికలు జరపనున్నాయి. దీని వలన సమసప్తక యోగం ఏర్పడుతుంది. దీంతో గురు చండాల దోషంతో బాధపడే రాశులు దానిని నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. ఇది అన్ని విధాలుగా రాశుల వారికి చాలా ప్రయోజనాలు తీసుకొస్తుంది.

గురు , రాహు గ్రహాల కలయిక వలన పన్నెండు రాశులలో తుల రాశి, కన్యా రాశి , మకర రాశి వారికి గురు చండాల దోషం నుంచి విముక్త లభిస్తుంది. అంతే కాకుండా ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం చేసే వారికి పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు.

మకర రాశి : మకర రాశి వారికి ఇక మంచి రోజులు మొదలు అయినట్లే, గత కొన్ని రోజుల నుంచి గురు చండాల దోషంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఈ రాశి వారు అక్టోబర్ చివరి నుంచి అద్భుతమైన ప్రయోజనాలు అందుకోనున్నారంట. ఈ రాశి వారికి ఆదాయం కూడా పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

తుల రాశి : తుల రాశి వారికి గురు, రాహు గ్రహాల కలియిక కొత్త ఆశలు తీసుకొస్తుంది. వీరికి వ్యాపార పరంగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా రియలెస్టేట్ రంగంలో ఉన్న వారు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఇంటిని లేదా ఫ్లాట్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం.

కన్య రాశి : కన్యా రాశి వారికి విదేశీ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా ఈ రాశిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది.