
కొత్త ఇంట్లోకి అడుగు పెట్టే సమయంలో గృహ ప్రవేశం కోసం శుభముహర్తం చూడాలి. తిథి, వార, నక్షత్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శుభ సమయంలో ఇంట్లోకి ప్రవేశించడానికి.. పండితులను సంప్రదించి పంచాంగం ప్రకారం ముహర్తం పెట్టించుకోవాలి. పండితులు పెట్టిన శుభ ముహర్తంలో నియమాల ప్రకారం పూజ చేసి అప్పుడు ఇంట్లోకి గృహ ప్రవేశం చేయాలి. హిందూ విశ్వాసం ప్రకారం మాఘ, ఫాల్గుణ, జ్యేష్ఠ , వైశాఖ మాసాలు గృహ ప్రవేశానికి చాలా శుభప్రదమైనవిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో వీలైతే గృహ ప్రవేశం కోసం ఈ తెలుగు నెలల్లో శుభ ముహర్తలను ఎంచుకోవాలి..

పంచాంగం ప్రకారం ఏదైనా మాసంలోని విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి తిథులు శుక్లపక్షంలో గృహ ప్రవేశానికి చాలా శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి.

కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు, శుభ మాసం మరియు శుభ తేదీతో పాటు, శుభ దినాన్ని కూడా పరిగణించాలి. హిందూ విశ్వాసం ప్రకారం ఆదివారం, శని, మంగళవారాల్లో పొరపాటున కూడా ఇంట్లోకి ప్రవేశించకూడదు. సోమ, బుధ, శుక్రవారాలు గృహ ప్రవేశానికి శుభప్రదమైనవి.

కొత్త గృహంలోకి ప్రవేశించే సమయంలో అన్ని ఆటంకాలను తొలగించి, శుభాలను, సౌభాగ్యాలను ప్రసాదించే విఘ్నాలకు అధిపతి గణేశుడిని దేవీ దేవతలను, తమ పూర్వీకులను ఆచార నియమాల ప్రకారం పూజించాలి.

హిందూ విశ్వాసం ప్రకారం కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ఎల్లప్పుడూ ముందుగా ఆవుని ఇంట్లోకి ప్రవేశింపజేసి.. అనంతరం ఆ ఇంటి యజమాని కుడి పాదాన్ని ముందుగా కొత్త ఇంట్లో పెట్టాలి. భవిష్యత్తులో కూడా ఈ నియమాన్ని పాటిస్తే మంచిది.

వివాహం చేసుకున్నవారు తమ కొత్త ఇంట్లోకి అడుగు పెడుతూ.. గృహ ప్రవేశ పూజను ఒంటరిగా చేయకూడదు. హిందూ విశ్వాసం ప్రకారం గృహ ప్రవేశకార్యక్రమాన్ని జీవిత భాగస్వామితో నిర్వహించాలి.

హిందూ విశ్వాసం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆ రాత్రి కొత్త ఇంట్లోనే నిద్ర చేయాలి. ఆ తర్వాత 40 రోజుల పాటు ఇంటిని ఖాళీగా ఉంచకూడదు. హిందూ విశ్వాసం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత 40 రోజులు ఇంటిని ఖాళీగా ఉంచడం అశుభంగా పరిగణించబడుతుంది.