
డిసెంబర్ 4న చందమామ ఆకాశానికి చాలా దగ్గరగా రానున్నది. దీనినే కోల్డ్ మూన్ అని కూడా అంటారు. అంతే ఈరోజు జాబిల్లి చాలా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. దీని తర్వాత మళ్లీ 2026 జనవరి 3వ తేదీన ఆకాశంలో సూపర్ మూన్ కనువిందు చేయనుంది. అయితే కోల్డ్ మూన్ రోజే మిథున రాశిలోకి చంద్రుడు సంచారం చేయడం వలన మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

ఈ కోల్డ్ మూన్ సమయంలో కొన్ని రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకోవడం, అలాగే భవిష్యత్తుకు సంబంధించిన ప్లానింగ్స్, , కమ్యూనికేషన్స్ పెంచుకోవడం వంటివి చేయడానికి మంచి సమయం. అంతే కాకుండా ఈ సమయంలో వీరు ఏపని చేసినా అది విజయవంతం అవుతుంది. వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది.

కన్యారాశి : కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రోజు వీరు తీసుకునే కీలక నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో ఉపయోగపడుతాయి. విదేశీ పర్యటన చేయాలి అనుకునేవారి కోరిక నెరవేరుతుంది. కళారంగంలో పని చేసేవారికి అద్భుతంగా ఉంటుంది.

మిథున రాశి : మిథున రాశి వారికి కోల్డ్ మూన్ వలన అదృష్టం కలిసి వస్తుంది.అనుకోని విధంగా డబ్బులు చేతికందుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి అనుకోని విధంగా లాభాలు చేకూరుతాయి. ఈ రాశుల వారికి పదోన్నతులు లభిస్తాయి. వీరికి కుటుంబం ద్వారా ఆనందం నెలకొంటుంది. అంతే కాకుండా వీరికి వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలిగిపోయి చాలా సంతోషంగా గడుపుతారు.