Garuda Panchami: కోవిడ్ నిబంధనల నడుమ ఘనంగా జరిగిన గరుడపంచమి వేడుకలు.. శ్రీవారి గరుడవాహన సేవ

|

Aug 14, 2021 | 6:49 AM

Garuda Panchami: తిరుమల శ్రీనివాసుడికి శుక్రవారం రాత్రి గరుడవాహన సేవ వైభవంగా జరిగింది. గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీమలయప్పస్వామి వారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు..

1 / 5
గరుడ పంచమి సంద‌ర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ తిరుమలలో వైభవంగా వాహనసేవ జరిగింది. శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

2 / 5
శ్రీవారి వాహనాల్లో, సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుడుడు.

3 / 5
నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం.

4 / 5
మంచి సంతానంతో కూడినటువంటి మాతృత్వాన్నే ప్రతి స్త్రీ ఆశిస్తుంటుంది ... ఆశపడుతుంటుంది. తమ పిల్లలు పరాక్రమవంతులై విజయాలు సాధించాలని కోరుకునే స్త్రీలకు అవసరమైన ఉత్తమమైన వ్రతమే 'గరుడపంచమి వ్రతం'. అన్నదమ్ములున్న యువతులు మాత్రమే 'శ్రావణ శుక్ల పంచమి' తిథిలో ఈ వ్రతమును చేయవలసి వుంటుంది.

5 / 5
 కోవిడ్ నిబంధనల నడుమ గరుడ వాహనసేవని ఘనంగా నిర్వహించారు. ఈ సేవలో ఆల‌య అధికారులు పాల్గొన్నారు. స్వామివారు గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.