నిమజ్జనం రోజు వినాయకుడి చెవిలో ఇలా చెబితే.. కోరిన కోర్కెలు నెరవేరతాయట!

Updated on: Sep 19, 2026 | 2:10 PM

వినాయక చవితి పండుగ ప్రారంభం అయ్యి ఆరు రోజులు అవుతుంది. సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి రోజు ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహం ప్రతిష్టించుకొని పూజలు చేస్తున్నారు. ఇక కొంత మంది తమ సంప్రదాయ, కుటుంబం ఆచారం ప్రకారం నిమజ్జనం చేయడం కూడా ప్రారంభించారు. అయితే వినాయకుడిని నిమజ్జనం చేసే సమయంలో ఈ చిన్న పని చేస్తే చాలు మీ తీరని కోరికలు కూడా తీరతాయంట. ఇంతకీ ఆ పనులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
వినాయకుడి పండుగ అంటే చాలు పల్లె, పట్నం అన్ని చోట్ల ఆ సందడే వేరుంటుంది. ప్రతి రోజూ ఉదయం సాయంత్రం పూజలు, కోలాటం, ఆట పాటలతో సందడి నెలకొటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ గణేష్ ఉత్సవాలలో చాలా ఆనందంగా పాల్గొంటారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల నిమజ్జనాలు కూడా ప్రారంభం అయ్యాయి.

2 / 5
అయితే నిమజ్జనం చేసిన సమయంలో వినాయకుడి చెవిలో ఈ పదాలు చెబితే చాలు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట. ఇంతకీ అవి ఏవి అనుకుంటున్నారా.  నిమజ్జనానికి తరలించే ముందు , వినాయకుడి ఎడమ చెవిలో మీ కోరికను చెప్పాలంట. కుడి చేతితో మీ నోటికి చేయి అడ్డు పెట్టి, మనసులో ఉన్నది గణేషుడికి చెప్పాలంట.

3 / 5
అంతే కాకుండా మీ కోరికను చెప్పిన తర్వాత నా కోరికను నెరవేర్చు స్వామి, గౌరవాన్ని కాపాడు, మేలు కలిగేలాచూడు స్వామి.. ఉద్యోగం, ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం కలగాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని దీవించు అని ఆయనకు చెప్పాలంట. ఇలా చెప్పడం వలన మీరు కోరిన కోరిక నెరవేరుతుందని చెబుతున్నారు పండితులు.

4 / 5
అయితే ఇలా చెప్పడం వెనుక ఒక కారణం ఉన్నది అంటున్నారు పండితులు. అది ఏమిటి అంటే? నిమజ్జనం అంటే వినాయకుడు భూలోకాన్ని వదిలి కైలాసం చేరుకోవడం. నిమజ్జనం తర్వాత వినాయకుడు నేరుగా కైలాసానికి చేరుకొని తన తల్లిదండ్రులను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటాడంట.  అందువలన మీరు ఆ సమయంలో చెప్పిన సన్ని వేశాన్ని ఆయన శివ పార్వతులకు చెరవేస్తాడని విశ్వసిస్తారు. అందువలన  నిమజ్జనం రోజు ఎవరికీ వినపడకుండా మీ కోరికను వినాయకుడి చెవిలో చెప్పాలంట.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us