
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు బంగారు వజ్ర వెండి ఆభరణాలు ఇతర కానుకలు భారీ ఎత్తున భక్తులు సమర్పించుకుంటున్నారు అందులో భాగంగానే తాజాగా ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబీకులు బంగారంతో తయారు చేసిన రుద్రాక్ష మాల, బంగారు హారం కానుకగా సమర్పించారు

శ్రీశైలం దేవస్థానానికి బంగారు రుద్రాక్ష రుద్రాక్ష బంగారు హారం విరాళంగా ఇచ్చారు భక్తులు. బాపట్ల కు చెందిన దాతలు మాధవి కుటుంబ సభ్యులు 43 గ్రాముల బంగారు రుద్రాక్ష మాల,30 గ్రాముల బంగారు హారం విరాళంగా స్వామి వారికి అందజేశారు.

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి బాపట్ల మాధవి కుటుంబ సభ్యులు బంగారు రుద్రాక్షమాల,బంగారు హారాన్ని దేవస్థానానికి విరాళంగా సమర్పించారు. వీటిలో 43 గ్రాముల బంగారంతో రుద్రాక్షమాలతో పాటు త్రిశూలం, ఢమరుకం చేయించినట్లు దాత తెలిపారు.

అలాగే 30 గ్రాముల బంగారంతో హారాన్ని తయారు చేయించినట్లు వారు పేర్కొన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆశీర్వచన మండపంలో దాతలు అధికారులకు అందజేశారు.

అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనంతో శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు ఆలయ పూజారులు దాతలకు అందజేయడం జరిగింది.