
కొబ్బరికాయ తెలియని వారు ఎవరూ ఉండరు. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే మొదట కొబ్బరికాయ కొట్టడం సహజం. పూజ, నూతన వాహనం కొనుగోలు చేసినా, కొత్తి ఇంటికి వెళ్లినా, వ్రతాలు, పూజలు, వ్యాపార ప్రారంభం, ఏ పని ప్రారంభించినా మందు కొబ్బరికాయ కొడుతుంటారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఏ చిన్న శుభకార్యం, ఏ పని చేసినా మొదట కొబ్బరికాయనే ఎందుకు కొట్టమంటారో, కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

కొబ్బరికాయ కొట్టడం అనేది స్వచ్ఛత, మానసిక ప్రశాంతతను సూచిస్తుంది. అంతే కాకుండా కొబ్బరికాయ కొట్టడం వలన విజయం వరిస్తుందని, ఏ పని చేసినా సక్సెస్ అవుతారని అంటారు. ఇక ఇది చెడు దృష్టి నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. అలాగే పూజలో కొబ్బరికాయ కొట్టడం వలన ఇది ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా కొబ్బరికాయను లక్ష్మీదేవిగా, కొబ్బరిపై ఉన్న మూడు కళ్లను త్రిమూర్తులను సూచిస్తాయంట. అందువలన ఏ శుభకార్యంలోనైనా సరే దీనిని కొట్టడం వలన ఇది జీవితంలో శాంతిని, ఆనందాన్ని తీసుకొస్తుందంట.

అయితే కొంత మంది స్త్రీలు కొబ్బరికాయను పగలగొట్టరు. దానికి కారణం ఉన్నదని చెబుతున్నారు పండితులు. సంప్రదాయాల ప్రకారం, కొబ్బరికాయను ఒక విత్తనంగా పరిగణిస్తారు. ఇది సృష్టి శక్తిని సూచిస్తుంది. అయితే స్త్రీలకు సృష్టి సామర్థ్యం ఉంది, వారు గర్భం దాల్చి, కొత్త జీవికి జన్మనిస్తారు, అందుకే వారు విత్తనాన్ని సూచించే పండును పగలగొట్టడం మంచిది కాదు అంటారు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొబ్బరికాయను కొడుతున్నారు.

అంతే కాకుండా కొబ్బరికాయ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంట. అందులో ముఖ్యమైనవి ఏవంటే?, ఆర్థిక అడ్డంకులను తొలిగించడం, చాలా మంది ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారు. ఇంటిలోకి వచ్చిన డబ్బు నిలవక, ఖర్చులు పెరగడం వంటి వాటితో సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి వారు ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయను చుట్టి,లక్ష్మీదేవి వద్ద ఉంచి, ఇంటి సంపద స్థానంలో పెట్టడం వలన ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయంట.

అలాగే ఎవరు అయితే శని బాధలతో సతమతం అవుతున్నారో, వారు శని వారం రోజున కొబ్బరికాయను మీ తలపై ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పి నదిలో వదిలి వెయ్యాలి. దీని వలన శని సమస్యలు తగ్గిపోతాయంట. అలాగే రాహు, కేతువు ప్రభావం తగ్గిపోవాలి అంటే, ఎండు కొబ్బరికాయను, చక్కెరతో నింపి, ఏకాంత ప్రదేశంలో మట్టిలో పాతిపెట్టడం వలన రాహు, కేతువు వలన కలిగే సమస్యలు తొలిగిపోతాయంట.