Diwali 2023: ధన్‌తేరాస్, దీపావళి నుండి అన్నాచెల్లల వరకు 5 రోజుల పండుగ ప్రాముఖ్యత, పురాణ కథ ఏమిటంటే

|

Nov 09, 2023 | 12:20 PM

కొన్ని ప్రాంతాల్లో దీపావళి పండగను రెండు రోజులు జరుపుకుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో దీపావళి పండుగ 5 రోజులు లేదా 6 రోజుల పాటు జరుపుకుంటారు. ధన్‌తేరస్‌తో ప్రారంభమైన దీపావళి వేడుకలు అన్నా చెల్లెల పండగలో ముగిస్తారు. భారతీయ కాల గణన సత్యయుగం నుండి మొదలవుతుందని చెబుతారు. ఈ యుగంలో తొలిసారిగా దీపావళి పండుగను జరుపుకున్నారు. దీని తరువాత త్రేతా, ద్వాపర యుగంలో ఇలా రాముడు, కృష్ణుడితో పాటు అనేక ఘటనలు దీపావళి వేడుకలను జరుపుకోవడానికి కథలు ఉన్నాయి. 

1 / 7
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీపావళి వేసందడి మొదలైంది. దీపావళి అంటే తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిపి ఆనందంగా జరుపుకునే పండుగ. ఈ పండుగలో ఒక్కోరోజు ఒక్కో ప్రాముఖ్యత, గుర్తింపు కలిగి ఉంది. దీపావళి వేడుకల్లో భాగంగా లక్ష్మీ దేవి, రాముడు, కృష్ణుడు, నాగేంద్రుడు ఆరాధనకు అంకితం చేయబడింది.ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ వివిధ దేవుళ్లను, దేవతలను పూజిస్తారు. ధన్ తేరాస్ రోజు నుండి షాపింగ్ తో పండగ  ప్రారంభమవుతుంది.. యమ ద్వితీయతో ముగుస్తుంది. ఈ ఐదు రోజులూ సర్వత్రా భక్తి, సంతోషాల వాతావరణం నెలకొంటుంది. అయితే పండగ సన్నాహాలు చాలా రోజుల ముందుగానే చేసుకుంటారు. ఈ పండగ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.. 

2 / 7
ధన్ తేరాస్ .. ఆశ్వయుజ మాసంలోని త్రయోదశి తిథి రోజున సముద్ర మథన సమయంలో  ధన్వంతరి  ఉద్భవించాడు. అప్పటి నుంచి  ధన్ తెరాస పండగ మొదలైంది. ధన్‌తేరస్‌లో కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఇంటికి తీసుకురావడం ఒక సంప్రదాయం. ఈ రోజున దీపాలను దానం చేయాలనే నమ్మకం కూడా ఉంది.. తద్వారా యమరాజు సంతోషిస్తాడు. ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈ సంవత్సరం ఈ పండుగను 10 నవంబర్ 2023 న జరుపుకోనున్నారు. 

3 / 7
నరక చతుర్దశి.. ద్వాపర యుగంలో ఈ ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథిలో శ్రీ కృష్ణుడు, సత్యభామ తో కలిసి నరకాసురుడిని సంహరించాడు. అప్పటి నుండి నరక చతుర్దశి పండుగను జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజున ఐదు లేదా ఏడు దీపాలు వెలిగించే సంప్రదాయం కూడా ఉంది. ఈసారి ఈ పండుగను 11 నవంబర్ 2023 న జరుపుకోనున్నారు. 

4 / 7
దీపావళి.. సత్యయుగంలో ఆశ్వయుజ మాసంలోని అమావాస్యనాడు సముద్ర మథనం నుండి లక్ష్మీదేవి తొలిసారిగా ఉద్భవించింది. ఈ రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మి దేవి వివాహం జరిగినట్లు పురాణ కథనం. అప్పటి నుంచి దీపావళి సంబరాలు మొదలయ్యాయి. తరువాత త్రేతాయుగంలో ఈ రోజున, రాముడు వనవాసం నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ రోజు మహాలక్ష్మిని పూజిస్తారు. ఈ సంవత్సరం దీపావళి పండుగను 12 నవంబర్ 2023 న జరుపుకోనున్నారు. 

5 / 7
గోవర్ధన పూజ.. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు దీపావళి మర్నాడు గోవర్ధన పర్వతాన్ని పూజించేవాడు. అప్పటి నుండి ఈ రోజు ఐదు రోజుల పాటు జరిగే ఈ పండుగలో గోవర్ధన పూజ ఒక భాగంగా మారింది. ఈ రోజున దేవుడికి అనేక రకాల వంటకాలతో పాటు.. పాలు, పెరుగు, నెయ్యి సమర్పిస్తారు. అలాగే ఆర్ధిక అభివృద్ధి, పెరుగుదల కోసం దీపాలు వెలిగిస్తారు. ఈ సంవత్సరం ఈ పండుగను 13 నవంబర్ 2023 న జరుపుకోనున్నారు. 

6 / 7
నాగుల చవితి: దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. ఈ పండగ రోజున పిల్లల సహా పుట్ట దగ్గరకు వెళ్లి పాలు సమర్పిస్తారు. మహిళలు ఉపవాసం ఉండి నాగపూజను ఆచరిస్తారు. చలిమిడి, నువ్వులతో చేసిన పదార్దాలతో నాగుల చవితికి నైవేద్యంగా సమర్పిస్తారు. 

7 / 7
అన్నాచెల్లెళ్ల పండగ..  భగిని హస్త భోజనంగా జరుపుకుంటారు. ద్వాపర యుగంలో ఈ రోజున కృష్ణుడు నరకాసురుడిని ఓడించిన తర్వాత తన సోదరి సుభద్రను కలవడానికి వెళ్ళాడు. సత్యయుగంలో ఈ రోజున యమ ధర్మరాజు తన సోదరి యమున ఆహ్వానంపై ఆమె ఇంటికి వెళ్ళాడు. యమునా దేవి తన అన్నకు కుంకుమ దిద్ది ఇష్టమైన ఆహారం అందించి  సత్కరించింది. అప్పటి నుండి ఈ రోజును అన్న చెల్లెల పండగగా జరుపుకుంటారు. ఈ రోజు అన్నదమ్ముల మధ్య ప్రేమ బంధాన్ని బలపరిచే రోజు. ఈ సంవత్సరం అన్నాచెల్లెళ్ల పండగ నవంబర్ 14 న జరుపుకోనున్నారు. 