
దక్షిణ కాశీగా పిలవబడే పుష్పగిరి పుణ్యక్షేత్రం విశిష్టత ఎంతో అమోఘమైనది .. ఇక్కడ శైవులు వైష్ణవులు ఇద్దరూ కలిసి పూజించే ఏకైక దేవాలయం పుష్పగిరి పుణ్యక్షేత్రం. ఇక్కడ పెద్దలకు పిండ ప్రదానం చేస్తే ఎంతో పుణ్యం , అంతేకాక కాశీకి వెళ్లి పిండ ప్రదానం చేసినంత పుణ్యం ఇక్కడ వస్తుందని నమ్మకం అందుకే దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు.

కడప నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం ను పుష్పగిరి పుణ్యక్షేత్రం.. ఇక్కడ పెన్నా నది, పాపాగ్ని నది, కుందూ నది, మాండవ్య నది, వల్కల నది మొత్తం ఐదు నదుల సంగమం పుష్పగిరి పుణ్యక్షేత్రం. దక్షిణ కాశీగా పేరుంపొందిన పుష్పగిరిలో ఆది గురువు శంకరాచార్యులు స్వయంగా శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు.

శైవులు, వైష్ణవులు కలిసి పూజించే చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో కాశీకి వెళ్లలేని వారు పుష్పగిరి క్షేత్రంలో పిండ ప్రధానం చేస్తే కాశీకి వెళ్లి వచ్చినంత పుణ్యమని అంటారు. అంతేకాక అరుణాచలంలో గిరిప్రదక్షిణ లాగా పుష్పగిరి క్షేత్రంలో కూడా గిరి ప్రదక్షణ చేస్తే అంతపుణ్యం అంట. అందుకే చాలా మంది ఇక్కడ గిరి ప్రదిక్షణ చేస్తారు.

ఎంతో పురాతనమైన దేవాలయంగా చెప్పుకునే పుష్పగిరి పుణ్యక్షేత్రం చుట్టూ 101 శివలింగాలు ఉన్నట్లు చెబుతారు అంతేకాకుండా ఈ పుణ్యక్షేత్రానికి చుట్టుపక్కల అనేక చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. అంతేకాక మహా విష్ణువు స్వయంగా ఏర్పాటు చేసిన ధన్వంతరి విగ్రహం కూడా ఇక్కడ ప్రతీతి .

అందువలన నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి చెన్నకేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అంతే కాకుండా ఈ ఆలయం పెన్నా నది, పాపాగ్ని నది, కుందూ నది, మాండవ్య నది, వల్కల నది మొత్తం ఐదు నదుల సంగమం. అందువలన ఇది పర్యాటకులను కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ ఆలయాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు.