
టాయిలెట్: మీరు ఇల్లు కొనేటపుడు అందులో టాయిలెట్ ఏ దిశలో ఉందో గమనించాలి. పశ్చిమ దిశలో టాయిలెట్ ఉండటం చాలా మంచిది. ఇంటికి అనుకోని కాకుండా వేరే ప్రదేశంలో టాయిలెట్ ఉండటం వల్ల ఆనందం కలుగుతుంది. ఇప్పుడు అన్ని ఇళ్లలో అట్టచేడ్ బాత్రూమ్స్ ఉంటున్నాయి. అలాంటప్పుడు సరైన టాయిలెట్ దిశలో ఉన్నది తీసుకోవాలి.

వంటగది: కొత్త ఇంట్లో, వాస్తు శాస్త్రం ప్రకారం, ఇల్లు కొనేటప్పుడు వంటగదిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం మంచిది. దానిని ఆగ్నేయ దిశలో ఉన్న అగ్ని మూలలో అమర్చడం శుభప్రదం. ఇలా ఉన్న ఇంటిని మాత్రమే తీసుకోండి. ఇలా చెయ్యడం కుంటుంబం అంతటికి మేలు జరుగుతుంది. ఆర్దికంగా బలపడతారని నమ్మకం.

పూజ గది: ఇల్లు కొనేటప్పుడు, ఇంటి పూజ గది ఈశాన్య దిశలో ఉండటం మంచిది. ఇది ఇంటికి శాంతిని, కుబేరుని ఆశీస్సులను తెస్తుంది. పూజ గది ఈ దిశలో ఉన్న ఇంటికి తీసుకున్నారంటే దేవుని దీవెనలు మీ ఎప్పుడూ ఉంటాయి. దీనివల్ల పురోగతి లభిస్తుందని నమ్మకం.

సూర్యరశ్మి: వాస్తు శాస్త్రం ప్రకారం, మన ఇంటిపై పడే సూర్యకాంతి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఇంట్లో కాంతిని అందించడమే కాకుండా, సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. మీరు తీసుకునే ఇంటికి వెంటిలేషన్ బాగుంటే.. సన్ లైట్ బాగా పడుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు.

చెట్టు, ట్యాంక్ లేదా పైపు ఉండకూడదు: ఇంటి ప్రధాన ద్వారం ముందు చెట్టు, ట్యాంక్ లేదా పైపు ఉండటం మంచిది కాదు. అలాంటి ప్రదేశాలలో ఇల్లు కొనడం వల్ల సానుకూల శక్తి ప్రసారం కాదు. దీనివల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి. ఆర్థికంగా నష్టం వస్తుంది. అందుకు ఇలాంటి ఇంటిని కొనడం మానుకోండి.