

ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి చిహ్నం. కనుక వ్యక్తికీ నైపుణ్యం చాలా ముఖ్యం. పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ విజ్ఞత అవసరం. లేకపోతే, వారు సులభంగా అనేక సమస్యలలో చిక్కుకుంటారు. చాణక్యుడు ప్రకారం, మనిషి చెడు సమయాల్లో కూడా తన స్వభావాన్ని మార్చుకోకపోతే, అతను ఎల్లప్పుడూ కష్టాలను అనుభవించవలసి ఉంటుంది.

ఒక వ్యక్తి తన స్వభావాన్ని తెలియజేసేది మాట. కనుక అతని మాటలో ఎల్లప్పుడూ మర్యాద ఉండాలని చాణక్యుడు నమ్మాడు. మధురంగా మాట్లాడే వ్యక్తులు త్వరగా విజయం సాధిస్తారు. అదే సమయంలో ఏ వ్యక్తి అయినా కోపంగా, చెడుగా మాట్లాడితే వారిని ఎవరూ ఇష్టపడరు. అటువంటి వ్యక్తులతో సంబంధం కలిగి ఉండటానికి ఎవరూ ఇష్టపడరు లేదా వారితో మాట్లాడటానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో వారి జీవితంలో వచ్చిన అవకాశాలు చేజారి పోతాయి. జీవితంలో అలాంటి వారు ఎటువంటి విజయాన్ని సాధించలేరు.

ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవులకు సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించాడు. అలాగే వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి చెప్పాడు. చాణక్యుడు ప్రకారం తనకు తెలియకుండానే వ్యక్తి చేసే తప్పులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనిషి పాటించాల్సిన కొన్ని విషయాలను చెప్పాడు.

చాలా మంది వ్యక్తులు.. ఎటువంటి పెద్ద పని మొదలు పెట్టినా.. దానికి సంబందించిన హ్యూహాన్ని ముందుగా సిద్ధం చెయ్యరు. దీని కారణంగా వారు వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. చాణక్యుడు ప్రకారం.. వ్యూహంతో చేసిన పని చాలా వరకు విజయవంతమవుతుంది. ఇలాంటి పనుల్లో సమస్యలు, అడ్డంకులు కూడా తక్కువగా వస్తాయి.. విజయం త్వరగా సాధిస్తారు.