ఆచార్య చాణక్యుడి బోధనలు జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడతాయి. అందుకే.. నేటికీ చాలామంది చాణుక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు. అయితే చాణుక్యుడు ముఖ్యంగా కొందరు వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిదని బోధించాడు.
నిప్పులో నెయ్యి వేస్తే.. నిప్పు ఎలా పెరిగి.. ఎటువంటి కీడునైనా చేయగలదు. అదే విధంగా కోపంలో ఉన్న వ్యక్తికి మరింత కోపం పెరిగేలా చేయడం ద్వారా ఆ వ్యక్తికీ మరింత కోపం పెరుగుతుంది. తన సమతుల్యతను కోల్పోయి.. తనతో పాటు.. ఇతరుల కూడా హాని కలిగేలా నిర్ణయాలను తీసుకంటారు.
ఆనందానికి ఆధారం మతం. మతానికి ఆధారం సంపద. అర్థానికి ఆధారం స్థితి ..అటువంటి స్థితికి ఆధారం ఇంద్రియాలను జయించడమే
తరచుగా అబద్ధాలు చెప్పే వ్యక్తి, ఒక రోజు తన అబద్ధాల వలలో తానే చిక్కుకుంటాడు. అతని అబద్ధం పట్టుబనప్పుడు అతను ఇతరుల నమ్మకాన్ని కోల్పోవడమే కాదు, అతని గౌరవం కూడా కోల్పోతాడు. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ.. అబద్ధాలను ఆశ్రయించకండి
పాలకుడు సమర్థులైన పరిపాలకుల సహాయంతో పాలించాలి. కష్టకాలంలో, రాజు స్వయంగా అన్ని నిర్ణయాలు తీసుకోలేడు. ఆ సమయంలో అర్హత కలిగిన సహాయకులు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోవడంలో ఆ రాజుకు సహాయపడతారు.