
పరస్పర గౌరవం: కుటుంబ సభ్యుల మధ్య పరస్పర గౌరవం ఉండే విధంగా వాతావరణాన్ని కల్పించండి. ఇంట్లో ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూసుకోండి. అంతేకాదు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను, భావాలను గౌరవించండి. ఇలా చేయడం వలన సానుకూల,సహాయక వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా చేస్తుంది

కుటుంబ ఏకీకరణ: కుటుంబంలో ఐక్యత, కలిసి ఉండాలనే భావాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించండి. కుటుంబ సభ్యులతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడానికి, భాగస్వామ్యులతో కలిసి వివిధ కార్యకలాపాలలో పాల్గొనే వాతావరణాన్ని కల్పించండి. అంతేకాదు విజయాలు , కెరీర్ లో మైలురాళ్లను ఫ్యామిలీ సభ్యులు అందరు కలిసి సమిష్టిగా జరుపుకునే విధంగా ప్రోత్సహించండి. ఇది కుటుంబ సంబంధాలను బలపరుస్తుంది.

విశ్వాసం- విధేయత: కుటుంబ సభ్యుల మధ్య విశ్వాసం .. విధేయత ఉండే విధంగా చూడండి. ఈ చర్యలు ఫ్యామిలీ కి బలమైన పునాదిని ఏర్పరుస్తాయి. సురక్షితమైన, సహాయక గృహ వాతావరణాన్ని సృష్టించడం.. తద్వారా విశ్వసనీయత, విధేయతను ప్రోత్సహించండి. ఇది పరస్పర విశ్వాసాన్ని పెంచుతుంది.

సోమరితనంతో చేయాల్సిన పనులను తరచుగా వాయిదా వేస్తారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని చాణక్యుడు సూచించాడు. విజయం సాధించాలంటే సోమరితనం విడనాడాలని అన్నారు. సోమరితనం ఉన్నవారికి విజయం ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పాడు. ఇంకా ఎవరికైనా సోమరితనాన్ని గొప్ప శత్రువుగా ఎత్తి చూపాడు.

వివాదాలను సునాయాసంగా పరిష్కరించుకోండి: ఏ ఇంట్లోనైనా గొడవలు సహజం. చర్చలు , రాజీ ద్వారా సంఘర్షణలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి. శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవడానికి క్షమాపణ చెప్పడం, సభ్యుల మధ్య అవగాహనకు ఉన్న విలువను బోధించండి.