
అయితే ఆమె 2026లో జూన్, డిసెంబర్ మధ్యలో కోటీశ్వరుల అయ్యే రాశుల గురించి కూడా తెలియజేయడం జరిగిందంట. కాగా, బాబా వంగా జ్యోస్యం ప్రకారం జూన్, డిసెంబర్ మధ్యలో పన్నెండు రాశులలో ఏ రాశుల వారికి కలిసి రానుంది? కోటీశ్వరులు అయ్యే రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

వృషభ రాశి : బాబా వంగా జ్యోష్యం ప్రకారం, 2026 చివరి వరకు వృషభ రాశి వారు ధనవంతులు అవ్వడం ఖాయం అని ఆమె చెబుతున్నారు. వీరికి ఈ సమయంలో చాలా శుభప్రదంగా ఉందంట. అందువలన ఊహించని విజయాలు అందుకుంటూ ముదుగు వెళ్తారు, ఆర్థికంగా, వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో వీరి బ్యాంకు బ్యాలెన్స్ రెట్టింపు అవుతుందంట.

సింహ రాశి : సింహ రాశి వారికి సెప్టెంబర్ వరకు శని బలహీనంగా ఉండటం వలన సమస్యల నుంచి బయటపడతారు. అయితే ఊహించని విధంగా అక్టోబర్ నెలలో మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. ఆర్థికంగా మీరు సంపన్నులు అవుతారు. ఆదాయం విపరీతంగా పెరుగుతుందని చెబుతున్నారు . అలాగే బాబా వంగా ప్రకారం, సింహ రాశి వారికి ఆర్థిక పురోగతి ఉండటమే కాకుండా, రాజకీయ, ఆర్థికంగా ఈ సమయంలో అద్భుతంగా కలిసి వస్తుందంట.

మకర రాశి : బాబా వంగా జ్యోష్యం ప్రకారం, 2026 చివరి దశలో మకర రాశి వారి జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. వీరు కెరీర్ పరంగా కొత్త శిఖరాలకు చేరుకుంటారు. కష్టానికి తగిన ప్రతి ఫలం లభిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి డబ్బుకులోటు ఉండదు, ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఎవరు అయితే ఉద్యోగంలో పదోన్నతల గురించి ఎదురు చూస్తున్నారో, వారు ప్రమోషన్ అందుకోవడం ఖాయం, ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో వీరి ఆదాయం డబుల్ అవుతుంది. అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా వీరికి చాలా మేలు జరుగుతుంది.