Ayodhya: ప్రాణ ప్రతిష్ట వేళ 500 ఏళ్ల తర్వాత తలపాగా, చెప్పులు ధరించనున్న సూర్యవంశరాజులు.. రామయ్య దయవల్లే అంటూ…

|

Dec 30, 2023 | 10:24 AM

మానవుడిగా జన్మించి తన నడవడికతో దేవుడిగా కీర్తించబడుతున్నాడు. కోట్లాది హిందువుల ఆరాధ్యదైవంగా పూజించబడుతున్నాడు. రామయ్య జన్మించిన ప్రాంతలోనే రామాలయం కూల్చివేతకు గురైతే.. కొన్ని వందల ఏళ్లుగా రాముడు నడయాడిన నెలలో రామాలయ నిర్మాణం కోసం పోరాటం చేసి.. చివరకు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకున్నాం.. దాదాపు 500 ఏళ్ల తర్వాత కొత్త ఏడాది 22.01.2024న అయోధ్యలో రాముడు జన్మించిన ప్రదేశంలోనే కుంభాభిషేకం జరగబోతోంది. ఆ రోజు మరో ముఖ్యమైన సంఘటనకు వేదిక కానుంది అయోధ్య.

1 / 8
బ్రహ్మాండమైన శ్రీరామ మందిర ప్రతిష్ఠాపనకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం అయింది. జనవరి 22వ తేదీన  రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది.

2 / 8
 అయోధ్య చుట్టుపక్కల 105 గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 1.5 లక్షల మంది సూర్యవంశీ క్షత్రియులు 500 ఏళ్ల తర్వాత తలపాగాలు, తోలు బూట్లు ధరించనున్నారు.

3 / 8
అప్పుడు అయోధ్యలో రామమందిరాన్ని పునర్నిర్మించే వరకు తలపాగాలు ధరించబోమని సూర్యవంశీ క్షత్రియులు శపథం చేశారు.

4 / 8
ఇస్లామియ రాజు హయాంలో రామజన్మ భూమిలోని రామాలయాన్ని కూల్చివేస్తున్న సమయంలో ఆలయాన్ని కాపాడేందుకు సూర్యకుల క్షత్రీయ వంశస్థులు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడారు. ఎంత సాహసోపేతంగా పోరాడిన ఈ సూర్యకుల క్షత్రీయవంశ సైనికులు ఆలయాన్ని కూల్చివేతను ఆపలేకపోయారు. దుర్ఘటన పట్ల చాలా బాధపడ్డారు.

5 / 8
మళ్లీ అదే స్థలంలో రామమందిరం నిర్మించే వరకు తలపాగాలు, చెప్పులు, గొడుగులు ధరించబోమని సూర్య వంశ క్షత్రీయులంతా ప్రతిజ్ఞ చేశారు.

6 / 8
అంతేకాదు గొడుగులు వాడమని, కాళ్లకు పాదరక్షకులు ధరించమని వేసుకోనని శపథం చేశారు. గత 500 శతాబ్దాల నుండి వీరు తమ ఇంట వివాహం, వేడుకలతో పాటు ఎటువంటి సమయం, సమయంలో కూడా తలపాగా ధరించలేదు.

7 / 8
తమ పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి, గత ఐదు శతాబ్దాల పాటు ఈ సూర్యవంశ క్షత్రియులు వివాహ సందర్భాలలో కూడా చెప్పులు,  తలపాగా, గొడుగు ధరించకుండా జీవించారు.

8 / 8
22 జనవరి 2024న రామమందిరం ప్రారంభోత్సవ సమయం ఆసన్నం అయిన వేళ ఇప్పుడు అన్ని గ్రామాల్లోని సూర్యవంశ క్షత్రియులకు తలపాగా ధరించేందుకు కొత్త తలపాగా తయారు చేసి గ్రామాలవారీగా పంపిణీ చేస్తున్నారు.