
అరుణాచలం అదొక మహాపుణ్యక్షేత్రం. ఇక్కడ నిత్యం భక్తులతో ఆలయం కలకలలాడుతుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజు ఆలయంలో సందడి ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ మహాపరమేశ్వరుడే పర్వతంగా కొలువుదీరాడు, అరుణాచల పర్వతాన్నే శివ స్వరూపంగా భావించి, పూజిస్తారు. నిత్యం ఆ పర్వతం చుట్టూ వేలమంది భక్తులు దాదాపు 14 కిలోమీటర్లు గిరిప్రదక్షణ చేస్తారు. తమిళనాడు రాష్ట్రాలోని తిరువణ్ణామలై నగరంలో అరుణాచలం కొండ వద్ద శివుడు అగ్ని లింగం రూపంలో దర్శనం ఇస్తాడు.

ఇక అరుణా చలం వెళ్లిన ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ చేయకుండా మాత్రం ఉండలేరు. అయితే చాలా మంది ఈ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో టోపీ అమ్మ దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటారు. ఆమెను తాకేందుకు ప్రయత్నం చేస్తారు. అంతే కాకుండా ఆమె చూపు తమ పై పడాలని కోరుకుంటారు, ఆమె ఎదురుగా వస్తుందంటే చాలు అదృష్టంగా భావిస్తారు.

మరి అసలు ఆ టోపీ అమ్మ ఎవరు? ఎందుకు ఆమె దర్శనం కోసం భక్తులు అందరూ ఎదురు చూస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. టోపీ అమ్మ అసలు పేరు పళని అమ్మ. ఆమెది కన్యాకుమారి. అయితే ఆమె ఎందుకు అరుణాచలం వచ్చిందో ఎవరికీ తెలియదు కానీ, అరుణా చలం వచ్చి అక్కడే స్థిరపడి, ఎఫ్పుడూ గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటుందంట. దాదాపు 12000సార్లుకు పైగా రోజు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షణ చేయడమే కాకుండా, నిత్యం ఆ శివయ్యను ధ్యానిస్తూ ఉంటుందంట.

చూడటానికి మురికి బట్టలు, తలపై టోపీ, చెదిరిన జుట్టుతో కనిపించే ఈ టోపీ అమ్మను కొంత మంది మతి స్థిమితం లేని వ్యక్తిగా భావిస్తే మరికొంత మంది మాత్రం, శివయ్య అనుగ్రహం పొందిన అవధూతగా, తపస్సిగా, భావిస్తారు. అందుకే ఆమె తాగిన టీ కప్పు కోసం ఎదురు చూస్తారు. తన దర్శన భాగ్యం కలగాలని కూడా ఎంతగానో ఆరాట పడుతుంటారు.

అయితే దీనికి కూడా ఒక కారణం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం, మణిమారన్ అనే వ్యక్తి మూత్రపిండాలలో రాళ్ల సమస్యతో చాలా బాధపడుతుండగా, ఆమె స్పర్శ తనకు తాకడంతో ఆ సమస్య తొలిగిపోయిందని చెప్పడంతో, టోపీ అమ్మకు చాలా గుర్తింపు లభించింది. అంతే కాకుండా తన ఉమ్మి చర్మానికి రాసుకుంటే చర్మ సమస్యలు తగ్గుతాయని అంటుంటారు. అలా మంచి ప్రఖ్యాతి సంపాదించుకున్న ఈ టోపి అమ్మ దర్శన భాగ్యం కలగాలని చాలా మంది అరుణాచలంలో ఎదురుచూస్తుంటారు.