
జ్యోతిష్య శాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొంత మంది తమ చేయి, లేదా ముఖం, రాశిని బట్టి తమ భవిష్యత్తు తెలుకుంటారు. కానీ సంఖ్యాశాస్త్రం ప్రకారం, పుట్టిన తేదీ, సమయం, నెలను బట్టీ కూడా కెరీర్, సక్సెస్ గురించి తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం న్యూమరాలజీ ప్రకారం, ఏ తేదీలో జన్మించిన వారు 30 సంవత్సరాల తర్వాత సక్సెస్ అందుకుంటారు అనేది తెలుసుకుందాం.

ఎవరి జనన జన్మ సంఖ్య అయితే 3 ఉంటుందో వారు 30 సంవత్సరాల తర్వాత సక్సెస్ అందుకుంటారు. వీరి ప్రతిభ , స్వీయ వ్యక్తీకరణ వంటివి వీరికి సక్సెస్‌ను త్వరగా ఇవ్వవంట. వీరు చాలా విషయాలను అనుభవాల ద్వారా నేర్చుకొని, కష్టపడిన తర్వాత విజయాన్ని చేరుకుంటారంట. ఇక 3,12,21వ తేదీల్లో జన్మించిన వారి జనన జన్మ సంఖ్య 3 కిందకు వస్తుంది.

ఎవరి జన్మ సంఖ్య అయితే నాలుగు ఉంటుందో వారి జీవితం ప్రారంభంలో చాలా గందరగోళంగా ఉంటుందంట. వీరు రాహువు చేత పాలించబడటం, పరిశోధన, ఆధ్యాత్మికతపై ఉన్న ఆసక్తి, ప్రత్యేకమైన విశ్లేషనాత్మక నైపుణ్యాల వలన వీరు త్వరగా సక్సెస్ అందుకోలేరని, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత, వీరు జీవితంలో విజయాన్ని అందుకుంటారు.

అదే విధంగా ఎవరి జనన సంఖ్య అనేది 8 ఉంటుందో వారు కూడా 30 సంవత్సరాల తర్వాత విజయం అందుకుంటారంట. 8,9,17,26 తేదీల్లో జన్మించిన వారు జనన సంఖ్య 8 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు శనిచే పాలించబడతారు. వీరు ఎక్కువ పోరాట లక్షణాలు కలిగి ఉంటారు. అందువలన వీరు సక్సెస్ కోసం చివరి వరకు పోరాటం చేసి, తమ జీవితంలో సక్సెస్ అవుతారు.

అదే విధంగా ఎవరి జనన సంఖ్య అయితే 9 ఉంటుందో వారు కూడా జీవితంలో చాలా ఆలస్యంగా స్థిరపడతారంట. వీరు పరిపూర్ణత , మాతవతావాదానికి ప్రతీక, అందువలన వీరు విజయం సాధించడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. చాలా ఆలస్యంగా సక్సెస్ అందుకునే వారిలో వీరు మొదటి స్థానంలో ఉంటారు.