హిందువులు పెద్ద పండగ అంటూ చెప్పుకొనే సంక్రాంతి మొదటి రోజున కొత్త బియ్యంతో పాయసం, పొంగల్ వంటి వంటకాలు చేస్తారు. దీని కోసం కొత్త కుండను తీసుకొని చుట్టూ పసుపు దారం, పూలదండను కట్టి, విభూతి, పసుపు, కుంకుమ పూసి అలంకరించి తర్వాత నీటితో నింపి వ్యవసాయ భూమిని ఇచ్చిన ఇంద్రుడు, సూర్యభగవానుడిని సంక్రాంతికి పూజిస్తారు. వ్యవసాయానికి సహాయపడిన పశువులకు కృతజ్ఞతలు తెలుపుతారు.