Telugu Astrology: ఈ రాశుల వారికి త్వరలో ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి!

Edited By:

Updated on: Nov 27, 2025 | 4:16 PM

6th House Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతక చక్రంలో ఆరవ స్థానాన్ని బట్టి జాతకుడు ఎదుర్కొనే కష్టనష్టాల గురించి చెప్పవలసి ఉంటుంది. ఆరవ స్థానం లేదా ఆరవ స్థానాధిపతి అనుకూలంగా ఉన్న పక్షంలో అనారోగ్యాల నుంచి, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధించాలన్నా ఆరవ స్థానం అనుకూలంగా ఉండడం తప్పనిసరి. ఫిబ్రవరి మొదటి వారం వరకూ ఈ షష్ట స్థానాధిపతి అనుకూలంగా ఉన్న రాశులు మేషం, మిథునం, తుల, ధనుస్సు, మకరం, మీనం. వీరికి మరో రెండున్నర నెలల కాలంలో తప్పకుండా కష్టనష్టాల నుంచి విముక్తి లభించి, హ్యాపీగా, సాఫీగా జీవితం గడిపే అవకాశం కలుగుతుంది.

1 / 6
మేషం: ఈ రాశికి షష్ట స్థానాధిపతి అయిన బుధుడు ఇప్పటి నుంచి సుమారు ఫిబ్రవరి వరకు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలేవీ పీడించే అవకాశం లేదు. సాధారణ అనారోగ్యాల నుంచి అతి తక్కువ సమయంలో విముక్తి లభిస్తుంది. ఇతర గ్రహాల కారణంగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉన్నందువల్ల సాధారణంగా వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోవడానికి అవకాశం కలుగుతుంది.

2 / 6
మిథునం: ఈ రాశికి షష్టాధిపతి అయిన కుజుడు మరో మూడు నెలల పాటు స్వక్షేత్ర, మిత్ర, ఉచ్ఛ స్థానాల్లో సంచారం చేయబోతున్నందువల్ల ఈ రాశివారు అనారోగ్యాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. అనారోగ్యానికి తగ్గ చికిత్స లభిస్తుంది. ధనకారకుడైన గురువు అనుకూలంగా ఉన్నం దువల్ల ఆదాయం వృద్ధి చెంది డిసెంబర్ మొదటి వారం నుంచి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. బంధుమిత్రులతో ఉన్న విభేదాలు కూడా సమసిపోతాయి.

3 / 6
తుల: ఈ రాశికి షష్టాధిపతి అయిన గురువు భాగ్య స్థానంలో ఉన్నందువల్ల ఈ రాశివారిని ఎటువంటి అనారోగ్యాలు బాధిస్తున్నా అతి త్వరలో విముక్తి లభిస్తుంది. వీరికి ఒకటికి రెండు పర్యాయాలు ధన యోగాలు పట్టే సూచనలున్నందువల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కూడా క్రమంగా తొలగిపోతాయి. గురువు భాగ్య స్థానంలో ఉన్నంత కాలం వీరు శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు కూడా అనుకూలంగా పరిష్కారమవుతాయి.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి ఆరవ స్థానాధిపతి అయిన శుక్రుడు ఫిబ్రవరి చివరి వరకూ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారిని అనారోగ్యాలు ఎక్కువ కాలం బాధించే అవకాశం లేదు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా చాలావరకు విముక్తి లభిస్తుంది. రాశ్యధిపతి గురువు డిసెంబర్ 5 నుంచి అనుకూలంగా మారబోతున్నందువల్ల ఆదాయం పెరిగి, వ్యక్తిగత, ఆర్థిక, వైవాహిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ సాఫీగా, సానుకూలంగా పూర్తవుతాయి.

5 / 6
మకరం: ఈ రాశికి షష్ట స్థానాధిపతి అయిన బుధుడు మరో రెండు నెలల పాటు దశమ, లాభ స్థానాల్లో సంచారం చేయడం, ఆరవ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారు ఎటువంటి అనారోగ్యం నుంచయినా డిసెంబర్ 5 తర్వాత పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. వీరిని సాధారణ అనారోగ్యాలు తప్ప దీర్ఘకాలిక అనారోగ్యాలు పీడించే అవకాశం లేదు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది.

6 / 6
మీనం: ఈ రాశికి షష్టాధిపతి అయిన రవి ప్రస్తుతం నవమ, దశమ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే అవకాశం ఉంది. రుణ సమస్యలు, శత్రు బెడదల నుంచి బయటపడడం జరుగుతుంది. వ్యక్తిగత సమ స్యలను సమయస్ఫూర్తిగా పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నిరాటంకంగా పూర్తవుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. వివాదాలు, విభేదాలు సమసిపోతాయి.