kamandala Ganpati: ఈ క్షేత్రంలో జగన్మాతతో పూజలందుకున్న గణేశుడు.. ఇక్కడ నీటికి వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు

|

Jun 27, 2021 | 2:29 PM

kamandala Ganpati : ఏ పని మొదలు పెట్టినా విఘ్నలు కలగకుండా నిర్విఘ్నంగా జరిగేలా చూడమని కొరుకుతూ వినాయకుడిని భక్తితో పూజిస్తాం.. అయితే ఇలా గణేశుడికి పూజలు చేసేది...మునులు, ఋషులు మానవులే కాదు.. దేవతలు సైతం పూజలను చేస్తారు. అలా జగన్మాతతో గణేశుడు పూజలందుకున్న కమండల గణపతిగా పూజలందుకున్నాడు.

1 / 5
హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలంటే.. వినాయకుడు సకల దేవతలకు అధిపతి.  ప్రప్రథమంగా పూజలను అందుకుంటూ.. చదువును, విజ్ఞానాన్ని అందించే ఆది దేవుడు వినాయకుడు. ఈయన్ని అనేక పేర్లతో కొలుస్తారు. పూజిస్తారు. అలాంటి గణేశుడు ఆలయం 
కర్ణాటక లోని  చిక్కమగళూరు జిల్లాలో ఉంది

హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలంటే.. వినాయకుడు సకల దేవతలకు అధిపతి. ప్రప్రథమంగా పూజలను అందుకుంటూ.. చదువును, విజ్ఞానాన్ని అందించే ఆది దేవుడు వినాయకుడు. ఈయన్ని అనేక పేర్లతో కొలుస్తారు. పూజిస్తారు. అలాంటి గణేశుడు ఆలయం కర్ణాటక లోని చిక్కమగళూరు జిల్లాలో ఉంది

2 / 5
  చిక్కమగళూరు లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాల నడుమ భక్తులను విశేషంగా ఆకర్షస్తున్న ఆలయం  కమండల గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదని తెలుస్తోంది.

3 / 5

శని వక్రదృష్టి కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొన్న పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయాలని భావించి శివుడి కంటే ముందుగా గణపతిని ప్రార్దించినదట. అప్పుడు బ్రహ్మచారి రూపంలో వినాయకుడు ఒక తిర్దాన్ని సృష్టించాడని స్థల పురాణం.

4 / 5

ఇలా వినాయకుడు బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి కనిపించిన వినాయకుడు సృష్టించిన తీర్ధాన్ని బ్రహ్మ తీర్థం అని, కమండలం ధరించి దర్శనమిచ్చిన గణపతిని కమండల గణపతి అనే పేరు వచ్చినది స్థల పురాణం.

5 / 5
ఇక్కడే పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ కుండికలో ప్రత్యక్షమయ్యే నీటిలో అనేక ఔషద గుణాలున్నాయంటారు. అందుకనే ఈ నీటిని సేవిస్తే అనేక వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. అందుకనే ఈ తీర్ధాన్ని స్వీకరించి అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శిస్తుంటారు.