
సోలో ట్రిప్ వెళ్లాలనుకునే అమ్మాయిలు తమ ప్రయాణానికి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మార్గమధ్యంలో ఎదురయ్యే అనుకోని సమస్యలను తేలికగా అధిగమించవచ్చు.

ప్రయాణానికి ముందే వెళ్ళాలనుకున్న గమ్యస్థానాన్ని నిర్ణయించుకుని, అక్కడ ఆహార, వసతి, రవాణా సౌకర్యాల గురించి తెలుసుకోండి. లేదంటే లేనిపోని ఇబ్బందుల బారిన పడాల్సి వస్తుంది.

సోలో ట్రిప్‌కి వెళ్లేవారు తమతో రెండో ఫోన్‌గా చిన్న కీపాడ్ మొబైల్‌ని తీసుకెళ్లడం మంచిది. స్మార్ట్‌ఫోన్‌లో చార్జింగ్ సమస్య ఉన్నా.. చిన్న ఫోన్‌లో చార్జింగ్ ఎక్కువ సమయం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇతరులకు కాల్ చేయడానికి చిన్న ఫోన్ ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా సోలో ట్రిప్‌ని ఆస్వాదించేందుకు మీరు భారీగా లగేజ్ ప్యాక్ చేసుకోకండి. వాటిని మోయడానికే సమయం సరిపోతే ట్రిప్‌ని ఆస్వాదించలేరు. అందువల్ల అవసరమైన మేరకు మాత్రమే లగేజ్ తీసుకెళ్లండి.

అలాగే సోలో ట్రిప్‌లో ఎక్కడకు వెళ్లినా డెబిట్, ఐడీ కార్డులను తప్పక మీతోనే తీసుకెళ్లండి. ఇంకా లిక్విడ్ క్యాష్‌ని తీసుకెళ్లడం మర్చిపోకండి. అన్ని ప్రదేశాల్లో యూపీఐ సేవలు లేదా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయని భావించకండి.

అన్నింటికంటే ముఖ్యంగా ఎప్పటికప్పుడు మీ లోకేషన్‌ని కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు అది మీవారికి మిమ్మల్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది.