
ప్రస్తుత లైఫ్‌స్టైల్ ఆహారకు అలవాట్ల కారణంగా కొందరు అనారోగ్య సమ్యలను ఎదుర్కొంటుంటే.. మరికొందరు వారి పెద్దల నుంచి వచ్చిన జీన్స్ ద్వారా ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిలో గురక కూడా ఒకటి. అయితే ప్రస్తుతం ఈ గురక విషయంలో చాలా మందిలో కొన్ని అపోహలు ఉన్నాయి. గురక పెట్టడం మన ఆరోగ్యానికి మంచిదా చెడ్డాదా అని. దీనిపై ఓ డాక్టర్ తాజాగా తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఒక పోస్ట్ చేశాడు.

చాలా మంది గురక పెట్టడం అంటే ప్రశాంతంగా నిద్రపోవడం అనుకుంటారు. కానీ ఇది పెద్ద పొరపాటు. ఎందుకంటే మీకు ఇలా గాఢ నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటే మీరు వెంటనే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అదితి శర్మ ప్రకారం, ఈ గురక అనేది గుండెపోటు ప్రమాదాన్ని పెంచే అవకాశ ముందని చెబుతున్నారు.

అవును.. డాక్టర్ అదితి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పోస్ట్ చేశారు. అందులో, గురక 20 ఏళ్లలో ఉన్న ఆరోగ్యకరమైన యువకుడి ప్రాణానికి ఎలా ముప్పు కలిగిస్తుందో వివరించారు. గురక అంటే రాత్రంతా వాయుమార్గం పదేపదే కుంచించుకుపోయే ప్రక్రియ.. ప్రతి గురకతో సంభవించే ఈ సంకోచం రక్తపోటులో అకస్మాత్తుగా పెరుగుదలకు, ఆక్సిజన్ స్థాయిలలో తగ్గుదలకు కారణమవుతుంది. దీని వల్ల గుండెపై పనిభారం పెరుగుతుంది. ఈ ప్రక్రియపై గుండెపై ఒత్తిని పెంచుతుంది.

ఇలా రాత్రంతా చేస్తే, అది నిశ్శబ్దంగా గుండెను దెబ్బతీస్తుంది. అందుకే 20 నుంచి 30 ఏళ్లలోపు చాలా మంది గుండెపోటుతో చిపోతున్నారు. ఇది కేవలం ఒత్తిడి లేదా స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల కాదు వచ్చే సమస్య కాదు. గుండె పోటును పెంచే పెను ప్రమాదం.. కాబట్టి మీరు నిద్రలో 'గురక పెడుతున్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించండి.

గురకను ఎలా నివారించాలి: మీరు గురక పెడితే, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే, వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి. మీరు నిద్రపోయే పొజిషన్‌ను మార్చుకోండి. అధిక శరీర బరువును తగ్గించుకోండి. మీకు స్లీప్ అప్నియా ఉందో లేదో టెస్ట్ చేసుకోండి. అని డాక్టర్ చెబుతున్నారు.