
కావాల్సిన పదార్థాలు : 500 గ్రాములు, రెండు పెద్ద ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, నాలుగు కోడిగుడ్లు , పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మసాలా, 3 టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి.

ముందుగా బీరకాయలను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి. ముక్కలు బాగా మగ్గనివ్వండి.

ఇక ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించి, స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక బీరకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.

ఇప్పుడు అదే పాన్ లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించాలి. దానిలో బీరకాయ ముక్కలు ,దానిలో ఉడికించిన ఎగ్స్ వేసి రెండు గ్లాస్ లు నీళ్లు పోసి పది నిమిషాలు పాటు మూత పెట్టి బాగా ఉడికించాలి.

బీరకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చివర్లో కొత్తిమీర వేసి కిందకు దించేయండి.