
మనం ఇప్పటి వరకు ఎన్నో ఆభరణాలను చూసాము. అయితే, ఇది వాటి కన్నా చాలా విలువైనది. శ్రీశైలం మల్లన్నకు ఐదు శిరస్సులతో కూడిన నాగాభరణం మీరు ఒకసారి చూస్తే.. కళ్ళకు అతుకోవాల్సిందే. అంత అద్భుతంగా ఉంది.

శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళంఅందించారు. ఐదు శిరస్సులతో కూడిన నాగాభరణం 2 కేజీల 610 గ్రాములు అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన దినేష్ కుటుంబ సభ్యులు వెండి నాగాభరణాన్ని విరాళంగా అందజేశారు.

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి ఈరోజు వెండి నాగాభరణం విరాళంగా ఇచ్చిన అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన దినేష్ కుటుంబ సభ్యులు శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళం అందజేశారు.

ఐదు శిరస్సులు గల వెండి నాగాభరణం బరువు 2 కేజీల 610 గ్రామలు. ఈ నాగాభరణాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన దినేష్ కుటుంబ సభ్యులు వెండి నాగభరణాన్ని అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో ప్రధాన అర్చకులకు అందించారు.

ప్రధాన అర్చకులు విజయ స్వామి,గంటి రాధాకృష్ణ, అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజి రవి,టెంపుల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున,ప్రధానార్చకుడు సమక్షంలో విరాళంగా అందించారు. నాగాభరణాన్ని అందజేసిన దాతకు దేవస్థానం రసీదు వేదఆశీర్వచనం శ్రీస్వామి అమ్మవారి శేషవస్త్రాలు ప్రసాదాలతో దాతను టెంపుల్ గంజి రవి,కే మల్లికార్జున సత్కరించారు.