Mangoes: మామిడి పండ్లు వీరికి విషంతో సమానం.. మరిచి తిన్నారో మీ బాడీలో జరిగేది ఇదే!

Updated on: May 10, 2026 | 10:22 AM

సాధారణంగా మామిడి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో దొరి ఈ పండ్లు తినడానికి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టపడుతారు. కొందరైతే సమ్మర్ సీజన్ ఎప్పుడొస్తుందా, మామిడి పండ్లు ఎప్పుడు తిందామా అని ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇవి టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజకరంగా ఉంటాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే కొందరు మాత్రం ఈ మామిడి పండ్లుకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక వైద్య కారణాల వల్ల కొంతమంది మామిడి పండ్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నవారు మామిడి పండ్లు తినకూడదో చూద్దాం.

1 / 5
ఓరల్ అలర్జీ సిండ్రోమ్: కొంతమందికి పుప్పొడి అలర్జీ ఉంటుంది. అంటే, ఏదైనా తిన్న తర్వాత వారికి నోటిలో దురద, బొబ్బలు, గొంతు నొప్పి, పెదవుల సమస్యలు వస్తాయి. పుప్పొడి అలెర్జీ ఉన్నవారు మామిడి పండు తినే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. అనుకోకుండా తింటే చర్మంపై దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదరురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ సమస్య ఉన్న వారు మామిడి పండుకు, మామిడి చెట్లకు దూరంగా ఉండాలి.

2 / 5
మధుమేహం: మామిడి పండులో సహజ సిద్ధమైన చక్కెర,  పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు మామిడి పండు తింటే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, వారు చాలా తక్కువ పరిమాణంలో, సరైన సమయంలో మాత్రమే మామిడి పండ్లను తినడం మంచింది. ఒక వేళ మీకు అంతలా తినాలి అనిపిస్తే కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోండి.

3 / 5
జీర్ణకోశ సమస్యలు: ముఖ్యం జీర్ణ సమస్యలు ఉన్నవారు మామిడి పండ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఏది తిన్నా, గ్యాస్ట్రైటిస్ వస్తుంది. వారు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ తో బాధపడతారు. తీపి పదార్థాలు తినడం వల్ల కడుపులో అసౌకర్యం కలుగుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలను అనుభవిస్తారు. కాబట్టి ఈ సమస్యలు ఉన్న వారు మామిడి పండ్లకు దూరంగా ఉండడమే మంచింది.

4 / 5
మందుల పరస్పర చర్యలు: మామిడి పండులో ఫ్యూరనోకౌమరిన్స్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారికి లేదా ఇతర వ్యాధులకు మందులు వాడుతున్న వారికి ఇబ్బంది కలిగించవచ్చు. మీరు ఏదైనా దీర్ఘకాలిక చికిత్స పొందుతుంటే, మామిడి తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది

5 / 5
ఎక్కువగా మామిడి పండ్లు తినడం వల్ల కడుపులో అసౌకర్యం కలగవచ్చు. గ్యాస్‌ను ప్రేరేపించే ఆహారాలతో మామిడి పండ్లు తినడం తీవ్రమైన కడుపు సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఒకేసారి ఎక్కువ మామిడిపండ్లు తినవద్దు. కానీ మీరు వాటిని రసంలా చేసుకుని తాగవచ్చు. చక్కెర లేకుండా కేవలం తాగడం మంచిది కాదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, మీరు మామిడిపండ్లు తినాలా వద్దా అని మీ వైద్యుడిని సంప్రదించాలి.

Follow Us