2015 పరిశోధనల ప్రకారం, ఒక గ్రాము ఆపిల్ గింజలలో అమిగ్డాలిన్ ఒకటి నుంచి నాలుగు మిల్లీగ్రాముల మధ్య ఉంటుంది. ఇది వివిధ రకాల ఆపిల్‌లను బట్టి ఉంటుంది. అయితే, విత్తనాల నుంచి విడుదలయ్యే సైనైడ్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. 50-300 mg హైడ్రోజన్ సైనైడ్ ప్రాణాంతకం కావచ్చు. ఒక గ్రాము ఆపిల్ గింజలో 0.6 mg హైడ్రోజన్ సైనైడ్ ఉంటుంది. అంటే 80 నుంచి 500 గింజలు తింటే మనిషికి ప్రాణాపాయం తప్పదు. ఇక పరిశోధనలో, శాస్త్రవేత్తలు అమిగ్డాలిన్‌ను నివారించడానికి, యాపిల్స్ తినడానికి, యాపిల్ జ్యూస్ తాగే ముందు వాటి విత్తనాలను తొలగించడం మంచిదని సలహా ఇచ్చారు. ముఖ్యంగా పిల్లలకు ఆపిల్ గింజలు తీసిన తర్వాత తినిపించాలి.