Plastic Bottle Side Effects: ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా..? మీ ఆరోగ్యం అంతే సంగతి.. తస్మాత్ జాగ్రత్త..

|

Mar 29, 2024 | 5:41 PM

ఈ రోజుల్లో చాలా మందికి ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగే అలవాటు పెరిగింది. అయితే, దీర్ఘకాలం పాటు ప్లాస్టిక్ బాటిళ్లతో నీరు తాగడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని మీకు తెలుసా.. ? అవును, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైన ప్లాస్టిక్ బాటిల్స్ రసాయనాలు, బ్యాక్టీరియాతో నిండి ఉన్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని నిల్వ చేయడం వల్ల శరీరానికి విషపూరితమైన ఫ్లోరైడ్, ఆర్సెనిక్, అల్యూమినియం వంటి హానికరమైన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి, ప్లాస్టిక్ బాటిల్‌లో నీరు తాగడం ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ బాటిల్ నుండి నీరు తాగడం వల్ల కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
క్యాన్సర్ వచ్చే ప్రమాదం: ప్లాస్టిక్‌ను అధికంగా ఉపయోగించడం వల్ల శరీరం దానిలోని రసాయనాలతో ప్రత్యక్ష సంబంధంలోకి వస్తుంది. దీని కారణంగా మన శరీరం అనేక వ్యాధులకు రిజర్వాయర్‌గా మారుతుంది. ప్లాస్టిక్‌లోని సీసం, కాడ్మియం, మెర్క్యురీ వంటి రసాయనాలు శరీరంలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

2 / 5
రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం: ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి విడుదలయ్యే రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది మన రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రోజుల తరబడి ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు తాగుతూ ఉంటే మనిషిలోని రోగనిరోధక శక్తి సన్నగిల్లే ప్రమాదం ఉంది.

3 / 5
కాలేయ క్యాన్సర్: ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల థాలేట్స్ అనే రసాయనాలు మన శరీరంలోకి చేరి కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అసలే ఇది వేసవి కాలం.. ప్లాస్టిక్ బాటిల్స్ పై ఎండ పడితే అవి మైక్రోప్లాస్టిక్ ను విడుదల చేస్తాయి. ఆ నీరు తాగితే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.

4 / 5
ఈ నీళ్లు సురక్షితం కాదా ?

ఈ నీళ్లు సురక్షితం కాదా ?

5 / 5
ప్లాస్టిక్‌ బాటిల్‌తో ఇన్ని అనార్థలను ఎదుర్కొకక తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా రాగి బాటిల్స్‌,ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్టీల్‌, మట్టి, వెదురు బాటిల్స్ వంటివి వాడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా ప్లాస్టిక్ బాటిళ్లు ఉపయోగించుకోవాల్సి వస్తే ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్​ను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.