Sea Cucumber: అంతరించి పోతున్న సముద్ర దోసకాయలు.. వాటి ధర, ప్రత్యేకత తెలిస్తే షాక్ అవుతారు

Updated on: Apr 01, 2025 | 4:14 PM

సముద్రంలో అనేక రకాల జీవులున్నాయి. వాటిల్లో కొన్ని జీవులు అయితే అంతరించిపోయే దశలో ఉన్నాయి. అలాంటి ఓ సముద్ర జీవి సముద్ర దోసకాయ. ఈ సముద్ర దోసకాయలు భారతదేశంలో రక్షిత జాతుల జాబితాలో ఉంది. వీటిలో అనేక ఔషధగుణాలున్నాయి. కనుక వీటికి భారీ డిమాండ్ నెలకొంది. దీంతో వీటిని అక్రమంగా పట్టుకుని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారు. ఎందుకంటే ఈ సముద్ర దోసకాయ ఒకొక్కటి కోట్లలో ఉంటుంది. ఈ ప్రత్యేకజీవుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

1 / 9
సముద్ర దోసకాయలు అవి మామూలు జీవులు కాదు. ఎక్కువగా దొరకవు. ఒక్కటి దొరికినా చాలు లక్షల్లో సంపాదించవచ్చు. అందుకే వాటిని అక్రమంగా రవాణా చేస్తుంటారు. వీటిని పట్టుకోవడం కోసం కొన్ని సార్లు ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ సముద్ర దోసకాయలు చాలా ప్రత్యేకమైన జీవులు.

2 / 9
ప్రపంచంలో 1,250 విభిన్న జాతుల ఈ సముద్ర దోసకాయలు ఉండగా.. జపనీస్ సముద్ర దోసకాయ చాలా ప్రత్యేకమైనది. అయితే మన దేశంలో తమిళనాడు తీర ప్రాంతాలతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోనే కనిపిస్తాయి. సముద్రపు లోతుల్లో నివసిస్తాయి.

3 / 9
ఇవి స్థూపాకారంగా, మృదువుగా ఉంటాయి. అవయవాలు ఉండవు. కేవలం, నోరు మాత్రమే ఉంటుంది. ఆకారం చూడడానికి దోసకాయను పోలి ఉంటుంది. అందుకే ఈ జీవులను సముద్ర దోసకాయ అని లేదా కక్డి అని కూడా అంటారు.

4 / 9
ఈ జీవులలో మెడిసిన్స్ విలువలున్నాయి. అంతేకాదు ఇవి పర్యావరణ పరిరక్షణ కూడా చేస్తాయి. జల పర్యావరణ వ్యవస్థకు సముద్ర దోసకాయలు చాలా ముఖ్యమైనవి. సముద్రపు అడుగుభాగాన్ని శుభ్రంగా ఉంచుతాయి. అంతేకాదు ఇవి ఖరీదైన సీఫుడ్. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో ఈ సముద్ర దోసకాయలకు విపరీతమైన డిమాండ్ ఉంది.

5 / 9
సముద్ర దోసకాయను సాంప్రదాయ చైనీస్.. దక్షిణాసియా వైద్యంలో మెడిసిన్ గా ఉపయోగిస్తున్నారు. వీటిని తినడం వలనా రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. ఆర్థరైటిస్, గుండె సంబంధిత వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది.

6 / 9

ఈ జీవులకు కొన్ని శతాబ్దాలుగా ఆసియాలో అత్యంత డిమాండ్ ఉంది. అధికంగా ధనికులు ఆహారంగా తీసుకుంటారు. ఇతర జీవులతో పోలిస్తే వీటిల్లో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్స్ ఉన్నాయి.

7 / 9
అంతేకాదు ఈ సముద్ర దోసకాయల చర్మంలో ఫ్యూకోసిలేటెడ్ గ్లైకోసామినోగ్లైకాన్ అనే రసాయనం అధిక శాతం ఉంటుంది. ఈ రసాయనాన్ని ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు.

8 / 9
అంతేకాదు ఐరోపాలో కొన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స కోసం, రక్తం గడ్డకట్టడానికి కూడా ఈ సముద్ర దోసకాయలను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు తినే ఆహారంలో ఉపయోగించే ఈజీవులు ఇప్పుడు పాశ్చాత్య ఔషధ కంపెనీలకు ఔషదంగా పనిచేస్తుంది. దీంతో వీటికి భారీ డిమాండ్ నెలకొంది. అనేక దేశాలు ఈ జీవులను విపరీతంగా ఉపయోగించడంతో కొన్ని జాతులు అంతరించి పోయే దశకు చేరుకున్నాయి.

9 / 9
ఈ సముద్ర దోసకాయలు మన దేశంలో రక్షిత జీవుల లిస్టు లో ఉంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం వీటిని పట్టుకోవడం, అమ్మడం, ఎగుమతి చేయడం చట్టవిరుద్ధం. అయితే అంతర్జాతీయ మార్కెట్లో వీటికి ఉన్న డిమాండ్ తో స్మగ్లర్లు రహస్యంగా విదేశాలకు విక్రయిస్తున్నారు.