- Telugu News Photo gallery Scientists solve mystery of bleeding waterfalls in antarctica after decades
Blood Falls: ‘రక్తం’ప్రవహించే నది.. 1.5 మిలియన్ ఏళ్ల పురాతన రహస్యాన్ని ఛేదించిన సైంటిస్ట్‌లు
ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలను దాచుకున్న నదీనదాలు అనేకం ఉన్నాయి. శాస్త్రజ్ఞులు ఆ రహస్యాలను అన్వేషిస్తూనే ఉన్నారు. తాజాగా హిమానీనదం క్రింద ఉప హిమనదీయ నదులు, సరస్సుల ఉన్నాయని కనుగొన్నారు. ఇవి ఉప్పు నీటితో నిండి ఉన్నాయి. ఈ నదిలో ఐరన్ కంటెంట్ ఉన్న ఉప్పునీటి ఉప్పునీరు ఉంది
Updated on: Mar 25, 2023 | 11:24 AM

ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలను దాచుకున్న నదీనదాలు అనేకం ఉన్నాయి. శాస్త్రజ్ఞులు ఆ రహస్యాలను అన్వేషిస్తూనే ఉన్నారు. తాజాగా హిమానీనదం క్రింద ఉప హిమనదీయ నదులు, సరస్సుల ఉన్నాయని కనుగొన్నారు. ఇవి ఉప్పు నీటితో నిండి ఉన్నాయి. ఈ నదిలో ఐరన్ కంటెంట్ ఉన్న ఉప్పునీటి ఉప్పునీరు ఉంది

అంటార్కిటికా తెల్లటి మంచుతో కప్పబడిన ఖండం. ఇక్కడ సూర్యకాంతి నెలల తరబడి చేరదు. అయితే ఇక్కడ నెత్తురు నదిలా ప్రవహించే చోటు ఉంది. దీనినే బ్లడ్ ఫాల్స్ రివర్ అంటారు. భూమికి దక్షిణ భాగంలో ఉన్న ఈ ఖండంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. తెల్లటి దుప్పటి కప్పుకున్నట్లు ఉండే ఈ ఖండంలో ఉన్న జలపాతంలో రక్తపు నీరు ఎందుకు ప్రవహిస్తుంది అనేది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ నెత్తుటి జలపాతం గురించి రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు బ్లడ్ ఫాల్స్ నది రహస్యం తెరపైకి వచ్చింది. UK వెబ్సైట్ డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. ఇటీవల యూనివర్శిటీ ఆఫ్ అలస్కా ఫెయిర్‌బ్యాంక్స్ పరిశోధకులు ఈ నది మిస్టరీని ఛేదించడంలో విజయం సాధించారు. ఈ జలపాతం మొదట 1911లో ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త థామస్ గ్రిఫిత్ టేలర్ కనుగొన్నారు. ఈ సరస్సు వయస్సు సుమారు 1.5 మిలియన్ సంవత్సరాలు.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. మొదటి నుండి కొనసాగుతున్న ఆక్సీకరణ కారణంగా ఈ నది నీరు రక్తం రంగులో ఎర్రగా కనిపిస్తుంది. లోయలో ఐరన్ కంటెంట్‌తో కూడిన ఉప్పునీరు అధికంగా ఉండడం దీనికి కారణమని పరిశోధకులు తెలిపారు. ఈ సరస్సులో కాంతి, ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. ఐరన్ కంటెంట్ ఉన్న ద్రవం గాలిలో ఉన్న ఆక్సిజన్‌తో తాకినప్పుడు.. అది తుప్పు పట్టి, నీరు రక్తం రంగులో ఎర్రగా మారుతుంది. ఏళ్ల తరబడి ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది.

నేషనల్ జియోగ్రాఫిక్‌లో ఇంతకు ముందు ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. శాస్త్రవేత్తలు, అన్వేషకుల బృందం ఈ మొత్తం ప్రాంతాన్ని అధ్యయనం చేసింది. హిహిమానీనదం క్రింద ఉప హిమనదీయ నదులు, సరస్సుల ఉన్నాయని కనుగొన్నారు. ఇవి ఉప్పు నీటితో నిండి ఉన్నాయి. ఈ నదిలో ఐరన్ కంటెంట్ ఉన్న ఉప్పునీటి ఉప్పునీరు ఉంది. అక్కడ ప్రవహించే నీరు ఎరుపు, నారింజ, బూడిద, తెలుపు రంగులతో దర్శనమిస్తాయి.

ఈ బ్లడ్ ఫాల్స్ ఎత్తు ఐదంతస్తుల భవనంతో సమానం. ఎర్త్ స్కై నివేదిక ప్రకారం.. బ్లడ్ ఫాల్స్ నీటిలో ఆక్సిజన్ లేదని పరిశోధకుల బృందం పరిశోధన తర్వాత కనుగొంది. అయితే 17 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. సల్ఫేట్ తగ్గింపు ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ సూక్ష్మజీవులు చాలా క్లిష్టమైన వాతావరణంలో నివసిస్తాయి.





























