1 / 5
ప్రతి జీవి బ్రతకాలంటే ఆహారం చాలా అవసరం. ఏమీ తినకపోతే ఏ జీవి అయినా ఎక్కువ కాలం బతకలేదు. కాబట్టి శరీరానికి కావలసిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. మనిషితో సహా ఏ ప్రాణి ఆహారం లేకుండా ఎక్కువ కాలం జీవించలేదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని జీవులు ఏమీ తినకుండా నెలల తరబడి జీవించగలవని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం.. తాబేలు ఎక్కువ కాలం జీవించే జంతువుగా పరిగణించబడుతుంది. తాబేలు ఏమీ తినకుండా నెలల తరబడి బతుకుతుందని పరిశోధకులు చెబుతున్నారు.