
అంతరిక్షంపై మానవునికి ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో పరిశోధనలు, ప్రయోగాలు చేపడుతూనే ఉన్నారు. విశ్వాంతరంలో ఉన్న రహస్యాలను కనుగునేందుకు మానవ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది.

ఈ క్రమంలోనే మనిషి ఎక్కువగా ఆసక్తి చూపిస్తోన్న గ్రహాల్లో అంగారక (మార్స్) ఒకటి. ప్రపంచ దేశాలు అంగారకుడిపై పరిశోధనులు నిర్వహిస్తూనే ఉన్నాయి. మరి ఈ గ్రహాన్ని సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అంగారక గ్రహం పరిమాణం చాలా చిన్నది.. దీని వ్యాసం కేవలం 6860 కిలోమీటర్లు మాత్రమే. ఈ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి 687 రోజులు పడుతుంది. అంటే అంగారక గ్రహంపై ఏడాదికి 687 రోజులు అన్నమాట.

ఒక వేళ మానవుడు అంగారక గ్రహంపై స్పేస్ సూట్ లేకుండా వెళితే.. శరీరంలోని నరాలు నలిగిపోతాయి. వ్యక్తి కేవలం రెండు నిమిసాల్లోనే చనిపోతాడు.

అంగారక గ్రహంపై 95 శాతం కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఈ గ్రహంపై ఉష్ణోగ్రత -88 డిగ్రీలుగా ఉంటుంది. దీంతో శరీరంలోని రక్తం కూడా గడ్డ కట్టుకుపోతుంది.

భూమిలాగా అంగారకుడిపై కూడా నాలుగు రకాల సీజన్లు ఉంటాయి. అయితే భూమితో పోలిస్తే ఈ కాలం రెట్టింపని చెప్పాలి. ఇక 2020 అక్టోబర్ 13న అంగారక గ్రహం భూమికి దగ్గరగా వచ్చింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 2022 డిసెంబర్‌లో మరోసారి భూమికి దగ్గరగా రానుంది.