Rosemary Oil For Hair Growth: ఈ నూనె క్రమం తప్పకుండా 4 నుంచి 6 నెలలు వాడారంటే.. పట్టులాంటి కురులు మీ సొంతం

|

Oct 24, 2023 | 12:24 PM

ఒక్కోసారి జుట్టు అకారణంగా అధికంగా రాలిపోతుంటుంది. ఇలా జుట్టు రాలిపోయేవారు ఇకపై చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజ్మేరీ ఆయిల్ వంటి సహజ నూనెలు జుట్టు రాలడాన్ని సహజసిద్ధంగా నివారిస్తుంది. రోజ్మేరీ ఆకులు చాలా వంటకాలలలో కూడా వినియోగిస్తుంటారు. వీటి ఆకుల్లోని ఔషధ గుణాలు వంటకు రుచిని తీసుకురావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు..

1 / 5
ఒక్కోసారి జుట్టు అకారణంగా అధికంగా రాలిపోతుంటుంది. ఇలా జుట్టు రాలిపోయేవారు ఇకపై చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజ్మేరీ ఆయిల్ వంటి సహజ నూనెలు జుట్టు రాలడాన్ని సహజసిద్ధంగా నివారిస్తుంది.

2 / 5
రోజ్మేరీ ఆకులు చాలా వంటకాలలలో కూడా వినియోగిస్తుంటారు. వీటి ఆకుల్లోని ఔషధ గుణాలు వంటకు రుచిని తీసుకురావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. రోజ్మేరీ నూనెకు సుదీర్ఘ చరిత్ర ఉంది. గ్రీకులు, రోమన్లు, ఈజిప్షియన్లు, హీబ్రూలు రోజ్మేరీని ఔషధంగా ఉపయోగించేవారు. రోజ్మేరీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

3 / 5
ఇక రోజ్మేరీ నుంచి తయారు చేసిన నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వెంట్రుకలకు పోషణను అందిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. రోజ్‌మేరీ ఆయిల్‌నుతో తలకు మసాజ్ చేసి గంట తర్వాత షాంపూతో తల స్నానం చేసుకుంటే సరి.

4 / 5
రోజ్మేరీ ఆయిల్ కలిగిన హెయిర్ ప్రొడక్ట్స్ జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజ్మేరీ ఆయిల్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. ఈ నూనెను కనీసం 4 నుంచి 6 నెలల పాటు క్రమం తప్పకుండా వాడితే జుట్టు దృఢంగా మారుతుంది. ఇది చుండ్రు సమస్యను తగ్గించి, జుట్టు నెరసిపోకుండా చేస్తుంది.

5 / 5
రోజ్మేరీ నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రోజ్మేరీ నూనెను నేరుగా తలకు అప్లై చేసుకోవచ్చు.  లేదంటే కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల రోజ్మేరీ ఆయిల్ కలిపి తలపై సున్నితంగా మసాజ్ చేసుకోవచ్చు.