డయ్యూలో RIIG (MoES) సమావేశం రెండవ రోజున విదేశీ ప్రతినిధులు గుజరాత్‌లోని గిర్ ఫారెస్ట్‌లోని దేవలియా లయన్ పార్క్‌ను సందర్శించారు.
గిర్ జాతీయ ఉద్యానవనం ఆఫ్రికా వెలుపల ప్రపంచంలోని ఏకైక ప్రదేశంగా పేరుగాంచింది. ఇక్కడ సింహాలకు సహజ ఆవాసాలుగా నెలకొన్నాయి.
30 మందికి పైగా ప్రతినిధులు పార్క్‌లో సఫారీ చేశారు. వివిధ రకాల పక్షులు, జింకలతో పాటు నక్కలు, చిరుతపులిలను కూడా వారు చూశారు. అనంతరం పార్క్ సావనీర్ దుకాణం నుంచి ప్రతినిధులు జ్ఞాపికలను అందుకున్నారు.
అనంతరం శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే.
దర్శనం తర్వాత ప్రతినిధులు ప్రపంచ శాంతి కోసం 'లఘు యజ్ఞం' నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతినిధులకు వీడియో ద్వారా యజ్ఞంలో ఉపయోగించాల్సిన 21 యజ్ఞ ఆహుతుల ప్రాముఖ్యతను వివరించారు.
ఒకసారి యజ్ఞంలో ఉపయోగించిన ఆహుతులను తోట ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. ఏ మూలకం వృధా కాకుండా చూసుకోవచ్చంట.
జీ20 సమావేశం థీమ్ వసుధైక కుటుంబాన్ని ప్రతిధ్వనిస్తూ యజ్ఞంలో డెలిగేట్స్ పాలుపంచుకున్నారు.