రిపబ్లిక్ డే స్పెషల్.. మీ పిల్లల కోసం అదిరిపోయే టిఫిన్ ఐడియాస్ ఇవే!

Updated on: Jan 25, 2026 | 2:55 PM

గణతంత్ర దినోత్సవం వచ్చేస్తోంది. దీంతో చాలా మంది తల్లులు తమ పిల్లలకు డిఫరెంట్‌గా, దేశ భక్తిని చాటే విధంగా టిఫిన్స్ చేసి పెట్టాలని ఆరాటపడుతుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన టిప్స్, కాగా మీరు మీ పిల్లలకు త్రివర్ణపతాకాన్ని సూచించే విధంగా టిఫిన్ చేయాలి అనుకుంటే, ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.

1 / 5
జెండారంగులో షాండ్ విచ్ చేసి, మీ పిల్లలను సర్ప్రైజ్ చేయండి. దీని కోసం ముందుగా మూడు బ్రెడ్ ముక్కలను తీసుకొని, వాటిలో మొదటి దానిపై గ్రీన్ చట్నీ, రెండదానిపై క్రీమ్ చీజ్, మూడవ దానిపై  క్యారెట్ పేస్ట్ వేయండి. అంతే జెండా రంగులో షాండ్ విచ్ రెడీ, దీనిని మీ పిల్లలు చాల ఇష్టంగా తింటారు.

2 / 5
జెండా రంగులో ఇడ్లీలు చేసి, మీ ఫ్యామిలీ, మీ పిల్లలను ఆశ్చర్యపరచవచ్చును.  దీని కోసం మొదటగా ఇడ్లీ పిండి తీసుకోవాలి. దీనిని మూడు భాగాలుగా చేసుకోవాలి. అందులో ఒకదానికి తురిమిన క్యారెట్ మిక్స్ చేయాలి,మరొకదానికి తెల్లటి ఇడ్లీ,  ఇంకోదాంట్లో పాలకూర పేస్ట్ యాడ్ చేయాలి. తర్వాత వీటిని కలిపి, ఇడ్లీ పాత్రలో వేసి స్ట్రీమ్ చేయాలి. అంతే జెండా రంగులో ఇడ్లీలు రెడీ.

3 / 5
చాలా మంది తల్లులకు ఉదయాన్నే పిల్లలకు టిఫిన్ చేయడం వీలు కాదు. అందుకోసమే వారు తమ పిల్లల బ్రేక్ ఫాస్ట్ కోసం ఫ్రూట్ బౌల్ ఇస్తుంటారు. అయితే ఈ ఫ్రూట్ బౌల్ కూడా మీ పిల్లల మనసు దోచుకునేలా, రిపబ్లిక్ వైబ్ తీసుకొచ్చేలా ఉండాలి అంటే, అందులో కెవి, అరటి, బొప్పాయి ముక్కలను జోడించండి. ముందుగా కివి , తర్వాత అరటి , తర్వాత బొప్పాయి మొక్కలను వరసగా అమర్చడం వలన ఇది త్రి వర్ణంలో కనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

4 / 5
పూరీలను కూడా మీరు జెండా రంగులో తయారు చేసి, మీ పిల్లలకు టిఫిన్ ప్రిపేర్ చేయవచ్చును. రిపబ్లిక్ డే రోజు పూరీ పిండి తీసుకొని, అందులో కొంచెం పిడిని సపరేట్ చేసుకొని , పాలకూరను జోడించాలి, తర్వాత కొంచెం పిండిలో క్యారెట్ రసం ఉపయోగించి చిన్న ముద్దలా కలుపుకోవాలి. మిగితాది వైట్ పిండిలోనే, కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత వీటిని పూరీల విధంగా తయారు చేసుకొని కాల్చుకోవాలి. అంతే జెండా రంగులో పూరీలు రెడీ.

5 / 5
రైస్‌తో కూడా త్రివర్ణ పులావ్ చేయవచ్చు. దీని కోసం బియ్యాన్ని మూడు భాగాలుగా చేసుకోవాలి. తర్వాత ఒక భాగానికి బఠానీ పాలకూర పేస్ట్ వేసి, మరొక భాగానికి కుంకుమ పువ్వు, క్యారెట్ తడ్కా వేయాలి. ఈ మూడింటిని ఒకదానిపై ఒకటి వేసి, బౌల్‌లో వేయాలి అంతే. త్రివర్ణ పులావ్ రెడీ.