
మన ఇల్లును ఎంత చక్కగా చూసుకుంటామో.. అంతకి రెట్టింపు బాత్రూమ్ ను కూడా అలాగే శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే, ఇవి మంచిగా ఉంటేనే మనకీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. లేదంటే ఒక దాని తర్వాత ఒకటి ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.

బేకింగ్ సోడా: టైల్స్ పై జిడ్డు ఎక్కువగా ఉంటే బేకింగ్ సోడా తీసుకుని దానిలో నాలుగు చుక్కలు నీరు వేసి వాటిపై రుద్ది ఐదు నిముషాల పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత మంచి నీరుతో కడిగితే క్లీన్ గా అవుతాయి.

నిమ్మకాయ: సాధారణంగా లెమన్ లో 'సిట్రిక్' ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలాంటి మొండి, జిడ్డు మరకలను కూడా తొలగించగలదు. మరకలు ఎక్కువగా టైల్స్ పై నిమ్మకాయ ముక్కతో రుద్ది 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో శుభ్రం చేయండి. అలా చేశాక మీ టైల్స్ చూసి మీరే షాక్ అవుతారు.

టూత్‌పేస్ట్: టైల్స్‌పై ఉన్న జిడ్డు, మురికిని పోగొట్టడానికి టూత్‌పేస్ట్ బెస్ట్. మీ ఇంట్లో వాడే పెద్ద బ్రష్ ను తీసుకుని దాని మీద టూత్‌పేస్ట్ మురికిగా ఉన్న టైల్స్ పై రుద్దండి. 10 నిముషాల తర్వాత నీటితో శుభ్రం చేస్తే టైల్స్ మొత్తం క్లీన్ అవుతాయి.

బ్లీచింగ్ పొడి : మురికిగా ఉండే వాటికీ బ్లీచింగ్ పౌడర్ కరెక్ట్ అని చెబుతారు. ఎందుకంటే, ఇది ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. ఒక బకెట్ నీళ్ళు తీసుకుని దానిలో బ్లీచ్ ను కలపండి. ఆ తర్వాత ఒక స్పాంజ్ తో టైల్స్ పై ఉన్నమరకల మొత్తాన్ని శుభ్రం చేసి చివర్లో నీటితో చల్లని నీరుతో మళ్లీ క్లీన్ చేయండి. అంతే మీ టైల్స్ పై నున్న జిడ్డు మొత్తం పోతాయి.