
రిలయన్స్ జియో తన యూజర్ల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.91కే 28 రోజుల వాలిడిటీతో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కేవలం డేటా వోచర్ కాకపోవడం విశేషం. రూ.100 లోపు లభించే ఈ ప్లాన్ పూర్తి ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

91 రూపాయల ఈ రీఛార్జ్ ప్లాన్‌తో కంపెనీ ప్రతిరోజూ 100 MB డేటాను అందిస్తుంది. దీంతో పాటు ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 200MB అదనపు డేటా 50 SMSల ప్రయోజనాన్ని అందిస్తుంది. 91 రూపాయలకు ఈ ప్లాన్ మీకు మొత్తం 3GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. డేటా పరిమితి పూర్తయిన తర్వాత నెట్ స్పీడ్ 64kbpsకి పడిపోతుంది.

రిలయన్స్ జియో రూ.91 ప్లాన్ తో, కంపెనీ 28 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ ప్లాన్ జియోఫోన్, జియోఫోన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే. రూ.91 ఈ సరసమైన ప్లాన్‌తో జియో క్లౌడ్ స్టోరేజ్, జియో టీవీకి ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

రూ.91 ప్లాన్‌తో పాటు కంపెనీ రూ.75 ప్లాన్‌ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇది 23 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ ప్రతిరోజూ 0.1 GB హై స్పీడ్ డేటా, 200 MB బోనస్ డేటా, 50 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. రూ.75 జియో ప్లాన్‌తో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ లభిస్తాయి.

ఈ ప్లాన్స్‌తో పాటు జియో రూ.125, రూ.152, రూ.186, రూ.223,రూ.895 రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. ప్రత్యేకత ఏమిటంటే రూ. 895 ప్లాన్ మీకు తక్కువ ధరకే 336 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ ప్లాన్‌లు తక్కువ ధరలో డేటా, కాలింగ్, ఇతర ప్రయోజనాలను కోరుకునే జియోఫోన్ వినియోగదారులకు ఇవి మంచి ఆప్షన్ గా నిలుస్తాయి.