
పాలకూర: మళ్లీ వేడి చేసుకొని తినకూడని కూగయాల్లో పాలకూర మొదటి స్థానంలో ఉంది. ఎందుంకంటే దీనిలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని మళ్లీ వేడి చేసినప్పుడు, ఇవి నైట్రేట్‌లుగా మారుతాయి. దీన్ని అలానే తినడం వల్ల ఇది రక్త ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. పిల్లలలో బ్లూ-స్కిన్ సిండ్రోమ్‌కు కారణమవుతుంది. ఇది పెద్దలలో తలతిరగడం, వాంతులు, తలనొప్పి,కడుపు నొప్పిని కూడా దారి తీస్తుంది. రెండోసారి వేడి చేసినప్పుడు పాలకూరలో ఉన్న ఇనుము ఆక్సీకరణం చెంది ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల మనం అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

బంగాళాదుంపలు: బంగాళాదుంపలను ఎప్పుడూ రెండోసారి వేడి చేయకూడదు. అలా చేయడం వల్ల అందులో ఉండే బోటులిజం బ్యాక్టీరియా ప్రమాదం పెరుగుతుంది. అలాగే, బంగాళాదుంపలలోని స్టార్చ్ మళ్లీ వేడి చేసినప్పుడు విచ్ఛిన్నమై, హానికరమైన సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. ఇవి మన శరీరానికి హాని చేస్తాయి. కాబట్టి ఉడికించిన లేదా బంగాళాదుంప ఆధారిత కూరగాయలను మళ్లీ వేడి చేయడం చాలా సురక్షితం కాదు.

పుట్టగొడుగు: పుట్టగొడుగులలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. దాన్ని మళ్లీ వేడి చేసినప్పుడు దాని ప్రభావం ప్రతికూలంగా పనిచేస్తుంది. దీనివల్ల కడుపు నొప్పి, గ్యాస్, వాంతులు, విరేచనాలు వస్తాయి. కాబట్టి, పుట్టగొడుగుల ఆహారాలను వెంటనే తీసుకోవాలి. రెండోసారి వేడి చేసి తీసుకోకూడదు.

బియ్యం: బియ్యాన్ని కూడా రెండోసారి వేడి చేయకూడదు. వండిన బియ్యంలో బాసిల్లస్ సెరియస్ బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నిరెండోసారి వేడి చేయడం వల్ల వాటి పరిమాణం పెరుగుతుంది. వాటిని తింటే తీవ్రమైన వాంతులు, విరేచనాలు వస్తాయి. అందువల్ల, బియ్యాన్ని సరిగ్గా నిల్వ చేసి త్వరగా తినడం చాలా ముఖ్యం.

మరికొన్ని కూరగాయాలు: పైన పేర్కొన్న కూరగాయలే కాకుండా క్యారెట్లు, టర్నిప్‌లు, దుంపలు వంటి భూగర్భంలో పెరిగే చాలా కూరగాయలలో నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రెండోసారి వేడి చేసి తినకండి. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ కారక లక్షణాలు కూడా మీలో కనిపిస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి.