
రాయలసీమలో ఇప్పుడు చెప్పుకోబోయే గుంత ఆమ్లెట్ చాలా ఫేమస్. వీటిని భగ భగ మండే నిప్పుల మీద తయారుచేస్తారు. ఈ గుంత ఆమ్లెట్ కు యువత నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మనం ఇప్పటి వరకు నార్మల్ ఆమ్లెట్ ను చూసాము.

వీటిని కూడా ఎగ్ తోనే చేస్తారు. కాకపోతే గుంతల ఉన్న పాన్‌లో తయారు చేస్తారు. రాయలసీమ స్పెషల్.. గుంత ఆమ్లెట్ కు కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

ఈ గుంత ఆమ్లెట్ ను గ్యాస్ మీద కాకుండా బొగ్గుల మీద చేస్తారు. అందుకే ఇది అంత రుచిగా ఉంటుంది. వీటిని గుంతల ఉన్న పాన్‌లో నెమ్మదిగా కాలుస్తారు. టేస్ట్ స్పైసీగా, మెత్తగా రుచికరంగా ఉంటుంది.

దీనికి కావాల్సిన పదార్దాలు : గుడ్లు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి కారం, కట్ ఉల్లిపాయ ముక్కలు, మసాలాలు , రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఉప్పు, నూనెను కూడా తీసుకోవాలి.

ఈ గుంత ఆమ్లెట్ ఫుడ్ ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది రూ.15 వరకు ఉంటుంది అంతే. ఇది ఎక్కువగా ఎక్కడ దొరుకుతుందంటే .. అనంతపురం, తిరుపతి వంటి ఏరియాల్లో సాయంత్రం పూట బాగా దొరుకుతుంది.