
రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించడం వల్ల మనలో క్రమశిక్షణా భావన పెరుగుతుంది. దీంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం మెరగవుతుంది.

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటివారు ఉపవాసం పాటించడం వల్ల అధిక బరువును కరిగించుకోవచ్చు. తక్కువ మోతాదులో తినడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.

ఈ మాసంలో ముస్లింలందరూ ఉపవాసం విరమించడానికి ఖర్జూరాలు తీసుకుంటారు. దీనివల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంద. అదేవిధంగా ఇందులోని పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి వంటి పలు పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తాయి.

ఉపవాస సమయంలో ధూమపానం, పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండాలని ఇస్లాం సూచిస్తుంది. కాబట్టి చెడు అలవాట్లను వదిలించుకోవడానికి రంజాన్ దీక్షలు మంచి సమయం.

ఉపవాసం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. ఎక్కువ సేపు ఖాళీ కడుపుతో ఉండడం వల్ల సాయంత్రం పూట ఇఫ్తార్ తీసుకుంటే శరీరంలో అడిపోనెక్టిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరంలోని పోషకాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.