
కావాల్సిన పదార్ధాలు: ఒక కప్పు సేమ్యా , మూడు కప్పులు పాలు, ఒక కప్పు చక్కెర, మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి, అర టీ స్పూన్ యాలకుల పొడి , 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, 10 కిస్మిస్, పిస్తాలు తీసుకోవాలి.

ముందుగా గ్యాస్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి, నెయ్యి వేసి మీడియా మంటపై ఉంచాలి. నెయ్యి కాగిన తర్వాత దానిలో జీడిపప్పు , కిస్మిస్ కు వేసి బంగారు రంగులోకి మారే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా వేయించాలి. ఆ తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

మళ్ళీ అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి అది వేడయ్యాక సేమ్యా వేసి మీడియా మంటపై ఉంచాలి. సేమ్యా మాడిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. అది గోల్డ్ కలర్లోకి మారే పొయ్యి మీదే ఉంచి బాగా వేయించుకోవాలి.

అదే పాన్‌లో మూడు కప్పుల పాలు పోసి , అవి బాగా మరిగిన తర్వాత మీడియా మంట మీద ఉంచి, సేమ్యా మెత్తగా అయ్యే వరకు గరిటెతో మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలి. సేమ్యా మెత్తగా అవ్వడానికి టైం పడుతుంది, కాబట్టి గ్యాస్ మీదే అలాగే ఉంచుకోవాలి.

సేమ్యా బాగా ఉడికిన తర్వాత దానిలో పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సేమియా మిశ్రమం పలుచగా అవుతుంది, కాబట్టి పొయ్యి మీదే ఉంచండి. జీడిపప్పు, కిస్మిస్, యాలకల పొడి వేసి చివర్లో 10 నిమిషాలు ఉంచి కిందకు దించేయడమే. అంతే, వేడి వేడి సేమియా పాయసం రెడీ.