
రాగి పిండి పాయసం మనిషి శరీర శక్తిని పెంచుతుంది. ఇంకా దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనిని తింటే, ఎముకలు కూడా బలంగా అవుతాయి. వీటిని తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికీ ఇది సూపర్ ఫుడ్. ఇంకా ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూసుకుంటుంది.

రాగి పిండి పాయసానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు రాగి పిండి, అర కప్పు బెల్లం , రెండు కప్పుల పాలు, రెండు కప్పుల నీరు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి, 10 జీడిపప్పులు, 10 కిస్మిస్ లు, రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుమును కూడా తీసుకోవాలి.

రాగి పిండి పాయసం తయారి విధానం : ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకోవాలి. ఆ తరవాత దీనిని వేడి నీళ్లలో కొంచం ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన దానిని తీసుకుని పక్కన బెట్టుకోవాలి. అయితే, మీరు దీనిని కొంచం కూడా ఉండలు లేకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి అప్పుడు అది పలుచగా అవుతుంది.

ఈ బెల్లం పాకాన్ని ఇంకోసారి స్టవ్‌పై పెట్టి, దానిలో రాగి పిండిని కొంచం కొంచం కలుపుతూ ఉండాలి. ఇంకా ఈ ముద్దలు పడకుండా బాగా కలుపుతూ 15 నిమిషాల పాటు దీనిని బాగా ఉడికించాలి. ఇక ఇప్పుడు పాలు పోసి ఇంకో 5 నిమిషాలు మీడియం మంటపై బాగా ఉడికించాలి. అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కొబ్బరిని వేసి బాగా కలపాలి.

ఇప్పుడు మళ్ళీ చిన్న పాన్ పెట్టి ఆయిల్ వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి ఈ రాగిపిండి పాయసంలో కలపాలి. వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. మరింత టేస్ట్ కోసం దీనిలో కొబ్బరి పాలు పోసుకోవచ్చు. ఇంకా దీనిలో నాలుగు బాదం, పిస్తా పప్పులు రుచి డబుల్ అవుతుంది.