Fake Currency: హైదరాబాద్‌ మహానగరంలో నకిలీ కరెన్సీ చలామణి గుట్టురట్టు.. మహిళతో సహా ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్

|

Sep 11, 2021 | 3:08 PM

రాష్ట్రవ్యాప్తంగా నకిలీనోట్ల కట్టలు గుట్టలుగా పట్టుబడుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా సాగిన నకిలీ నోట్ల చలామణి ప్రస్తుతం తెలంగాణలో మళ్లీ పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది.

1 / 5
రాష్ట్రవ్యాప్తంగా నకిలీనోట్ల కట్టలు గుట్టలుగా పట్టుబడుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా సాగిన నకిలీ నోట్ల చలామణి ప్రస్తుతం తెలంగాణలో మళ్లీ పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది. అడపా దడపా నకిలీగాళ్లు పడుతున్నారు.

2 / 5
హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతోన్న దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు..పట్టుబడిన ముఠా నుంచి రూ. కోటి విలువచేసే నకిలీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు.

3 / 5
హైదరాబాద్ శివారు ప్రాంతంలో పెద్దమొత్తంలో ఫేక్‌ కరెన్సీ పట్టుబడటం కలకలం రేపుతోంది. నోటును నిశితంగా పరిశీలిస్తే తప్ప ఏది నకిలీ..ఏది అసలు నోటు అనేది తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా అమాయకులను అవలీలగా బోల్తా కొట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు.

4 / 5
ఈ కేసుకు సంబంధించి కరీంనగర్ జిల్లాకు చెందిన మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ ముఠా తెలంగాణ, ఏపీ, తమిళనాడులో మోసాలకు పాల్పడినట్లుగా రాచకొండ పోలీసులు తెలిపారు.

5 / 5
తాజాగా హైదరాబాద్ శివారు కీసర పోలీసు స్టేషన్ పరిధిలో నకిలీ నోట్లు తయారు చేస్తూ..చలామణీ చేస్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.కోటి నకిలీ కరెన్సీ, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు