Tobacco: పొగాకు మానేస్తే కోటీశ్వరులు కావచ్చట.. ఎలాగో తెలుసా? షాకింగ్‌ రిపోర్ట్‌..!

Updated on: Apr 21, 2026 | 11:12 AM

Tobacco: భారతీయ కుటుంబాలు కేవలం పొగాకు మానేస్తే కోటీశ్వరులు కావచ్చట. వినడానికి విడ్డూరంగా ఉందని అనిపించవచ్చు. కానీ భారతీయుల్లో ఉండే పొగాకు అలవాట్లపై ఇటీవల ఓ అధ్యయనం జరిగింది. దీనిపై నిపుణులు సంచనల విషయాలను బయటపెట్టారు. మరి కేవలం పొగాకు మానేస్తే కోటీశ్వరులు ఎలా కాగలరో రిపోర్టు వివరించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

1 / 5
 Tobacco: భారతదేశంలో పొగాకు వాడకం అనేది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక సంక్షోభం కూడా. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. దేశంలోని సుమారు 10 శాతం కుటుంబాలు కేవలం పొగాకు అలవాటును వదులుకోవడం ద్వారా తమ ఆర్థిక స్థాయిని మెరుగుపరచుకోగలవని వెల్లడైంది. అంటే, పేదరికంలో ఉన్నవారు మధ్యతరగతి స్థాయికి ఎదిగే అవకాశం కేవలం ఈ ఒక్క మార్పుతోనే సాధ్యమవుతుంది.

2 / 5
అధ్యయనంలోని ముఖ్యాంశాలు: ఈ అధ్యయనం భారతీయ గృహాల ఖర్చుల సరళిని విశ్లేషించింది. పొగాకు కోసం ఖర్చు చేసే డబ్బును విద్య, పోషకాహారం, ఇతర ఉత్పాదక రంగాలకు మళ్ళిస్తే కలిగే ప్రయోజనాలను వివరించింది. అలాగే ఎలాంటి నష్టాలు వాటిల్లుతున్నాయి..?  దీనిపై అధ్యయనం షాకింగ్‌ నిజాలను వెల్లడించింది. అయితే పొగాకు భారతీయ ప్రజలు ఎంతో సంపదను నష్టపోతున్నారని వివరించింది.

3 / 5
 ఆర్థిక స్థితిలో మార్పు: దేశవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల కుటుంబాలు పొగాకు మానేయడం ద్వారా ప్రస్తుత ఆర్థిక తరగతి నుండి పై తరగతికి (Economic Class) వెళ్లే అవకాశం ఉంది. అలాగే పొగాకు మానేసి డబ్బు సంపాదన వైపు అడుగలు వేసి మంచి జీవనవిధానాన్ని అందిపుచ్చుకున్నట్లయితే లక్షాధికారులే కాదు కోటీశ్వరులు కూడా కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

4 / 5
 విద్య, ఆహారం: పొగాకు వాడే కుటుంబాలు ఆహారం, విద్యపై పెట్టే ఖర్చు కంటే పొగాకు ఉత్పత్తులపై (సిగరెట్లు, బీడీలు, గుట్కా) పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంటోందని ఈ నివేదిక హెచ్చరించింది. ఆరోగ్య ఖర్చులు: పొగాకు వల్ల వచ్చే వ్యాధుల చికిత్స కోసం చేసే ఖర్చు ఆ కుటుంబాలను మరింత అప్పుల ఊబిలోకి నెడుతోంది. పొగాకు ఖర్చు vs అభివృద్ధి: పొగాకు వినియోగించే కుటుంబం సగటున నెలకు వందల నుండి వేల రూపాయలను దీని కోసం ఖర్చు చేస్తోంది. ఈ మొత్తాన్ని పొదుపు చేయడం లేదా పిల్లల చదువుల కోసం ఉపయోగిస్తే, ఆ కుటుంబం జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయి.

5 / 5
 ప్రభుత్వ, సామాజిక బాధ్యత: పొగాకు నియంత్రణకు కేవలం చట్టాలు మాత్రమే సరిపోవని, ప్రజల్లో ఆర్థిక అవగాహన కూడా పెరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచడం ద్వారా వాటి వినియోగాన్ని తగ్గించవచ్చు. పొగాకు వల్ల కలిగే ఆర్థిక నష్టాల గురించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాలి. పొగాకు మానేయడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, ఇంట్లో సిరిసంపదలు కూడా పెరుగుతాయని ప్రజలు గుర్తించాలి. భారతదేశ ఆర్థికాభివృద్ధికి పొగాకు ఒక పెద్ద అవరోధంగా మారింది. ప్రతి పౌరుడు పొగాకుకు దూరంగా ఉంటే, అది దేశ జిడిపికి తోడ్పడటమే కాకుండా కోట్లాది కుటుంబాల తలరాతలను మారుస్తుంది.

Follow Us