పిల్లలకు బెస్ట్ స్నాక్స్..అప్పటికప్పుడు చేసే మినీ బోండాలు ఎలా చేయాలంటే?

Updated on: Jul 10, 2026 | 9:33 PM

పిల్లల స్నాక్స్ గురించి తల్లి ఎప్పుడూ చింతిస్తూనే ఉంటుంది. వారికి కొత్త కొత్త వంటకాలు తయారు చేసి పెట్టాలని తెగ ఆరాట పడుతుంటారు.ఇక పిల్లలకు పునుగులు, మినీ బోండాలు, బజ్జీల వంటివి చాలా ఇష్టం ఉంటాయి. అయితే వీటిని అప్పటికప్పుడు చాలా సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : బియ్యం పిండి, బంగళా దుంపలు, అల్లం చిన్న ముక్క, పచ్చి మిర్చి, జీలకర్ర, ఉప్పు, నూనె,  చిటికెడు కారం. ఈ తక్కువ పదార్థాలతో మినీ బోండాలు చాలా సులభంగా తయారు చేయవచ్చును. అంతే కాకుండా ఇవి చాలా రుచికరంగా కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం మినీ బోండాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

2 / 5
కావాల్సిన పదార్థాలు ముందుగా బంగాళదుంపలు తీసుకొని మంచిగా, చాలా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి, ఉడికించిన బంగాళ దుంపలు, అల్లం ముక్క,ఉప్పు, చిటికెడు కారం అన్నీ కూడా సరిసమానంగా, మీరుచికి తగ్గట్లుగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి.

3 / 5
తర్వాత అందులో నీళ్లు పోస్తూ మళ్లీ మంచిగా కలుపుకుంటూ ఉండాలి. చిక్కటి పేస్టులా కలుపుకోవాలి. అచ్చం పునుగులు లేదా బోండాలు వేసుకునే పిండిలా కలుపుకోవాలి. అంతలా కలవకపోతే వీలైతే గ్రైండ్ పట్టుకోవాలి. ఇప్పు డు ఈ మిశ్రమం మంచిగా కలిపి పక్కన పెట్టుకొని, అందులో పచ్చి మిర్చీ, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి.

4 / 5
తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో పునుగులు కాల్చుకోవడానికి సరిపడ నూనె పోసుకోవాలి. నూనె బాగా మరిగే వరకు చూసుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వా అందులో పిండిని చిన్న చిన్న గా తీసుకుంటూ అచ్చం మినీ బోండాలలా వేసుకోవాలి. దూరం దూరంగా వేసుకోవాలి. అవి మంచిగా కాలుతాయి.కొంచెం నురగ మొత్తం పోయిన తర్వాత వాటిని అటు ఇటు తిప్పుతూ మంచిగా కలుపుకోవాలి.

5 / 5
ఇప్పుడు అవి బాగా కాలి, బంగారు రంగులో వచ్చేలా చూసుకోవాలి. అప్పుడు వాటిని వేరే ప్లేట్ లో కి మార్చుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రుచికరమైన మినీ బోండాలు రెడీ. చిన్న పిల్లలే కాకుండా, పెద్దవారు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.

Follow Us