ఆరోగ్యానికి అమృతం ఈ పాలు.. రోజూ ఈ టైంలో తాగితే ఎంతో మేలు

10 July 2026

TV9 Telugu

TV9 Telugu

ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సాధారణ పాలకు బదులుగా బాదం పాలను ఎంచుకుంటున్నారు

TV9 Telugu

బాదం పప్పులతో తయారయ్యే ఈ పానీయం రుచికరంగా ఉండటమే కాకుండా అనేక పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా లాక్టోస్ అసహనం ఉన్నవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం

TV9 Telugu

బాదం పాలలో విటమిన్ E సమృద్ధిగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి శరీర కణాలను రక్షించడంలో సహాయపడుతుంది

TV9 Telugu

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యానికి కూడా విటమిన్ E మేలు చేస్తుంది

TV9 Telugu

ఈ పానీయంలో కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. చక్కెర కలపకుండా తీసుకుంటే శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోదు

TV9 Telugu

బాదం పాలలో మంచి కొవ్వులు ఉంటాయి. అలాగే ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, విటమిన్ D వంటి పోషకాలు ఇందులో దండిగా ఉన్నాయి

TV9 Telugu

ఇవి ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా బాదం పాలు కొంత మేర సహకరిస్తాయి

TV9 Telugu

కప్పు బాదం పాలు తీసుకొని అందులో చిటికెడు యాలకుల పొడి, కొద్దిగా అల్లం వేసి మరిగించాలి. దీనిని గోరువెచ్చగా పడుకునే ముందు తాగితే హాయిగా నిద్రలోకి జారుకుంటారు