కూరగాయలు లేవా ?? కేవలం 4 టమాటాలతో అదిరిపోయే మసాలాకూర చేసుకోండి ఇలా

Updated on: May 09, 2026 | 7:30 PM

మీ ఇంట్లో కూడా అప్పుడప్పుడు కూరగాయలు అయిపోయి, "ఈరోజు ఏం వండాలి?" అని తల పట్టుకుంటున్నారా? కేవలం నాలుగు టమాటాలు ఉంటే చాలు, హోటల్ స్టైల్ మసాలా కర్రీని ఇంట్లోనే రెడీ చేసేయొచ్చు. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా, అఖిరికి బిర్యానీలోకైనా సరే.. అద్భుతంగా ఉంటుంది! అయితే తయారీ విధానం ఎలానో తెలుసుకోండి.

1 / 5
 రోజూ తినే పప్పు, సాంబార్ కాకుండా ఏదైనా కొత్తగా, స్పైసీగా తినాలనిపిస్తే ఈ టమాటా మసాలా కర్రీ బెస్ట్ ఆప్షన్. సాధారణంగా మనం టమాటాను కేవలం పప్పులోకో లేక చట్నీకో వాడుతుంటాం. కానీ, కొంచెం మసాలా దట్టించి వండితే దీని రుచి వేరే లెవల్‌లో ఉంటుంది.

2 / 5
ముఖ్యంగా బ్యాచిలర్స్ లేదా వంట త్వరగా ముగించాలనుకునే వారికి ఇది ఒక వరమనే చెప్పాలి. వంట రుచిగా రావాలంటే మసాలాలు పర్ఫెక్ట్‌గా ఉండాలి. దీని కోసం ముందుగా పల్లీలు, నువ్వులు, ధనియాలు, కొబ్బరి మరియు కొన్ని గరం మసాలా దినుసులను దోరగా వేయించుకోవాలి.

3 / 5
వేయించిన దినుసులకు వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ గ్రేవీ ఎంత చిక్కగా ఉంటే కూర అంత రుచిగా ఉంటుంది. గ్రేవీకి అసలైన రంగు, రుచి ఈ దశలోనే వస్తాయి. ఇది కేవలం టమాటాలకే కాదు, వంకాయ లేదా పన్నీర్ కూరలకు కూడా వాడవచ్చు.

4 / 5
ఈ మసాలా పేస్టే ఈ కూరకి అసలైన రుచిని, చిక్కదనాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలను ముక్కలుగా కోయకుండా, వాటికి చిన్న గాట్లు పెట్టి గ్రేవీలో ఉడికించడం వల్ల టమాటాలోని జ్యూస్ అంతా మసాలాలోకి చేరి రుచి అదిరిపోతుంది.

5 / 5
ముఖ్యంగా ఈ కూరలో వేసే చిన్న బెల్లం ముక్క మరియు చింతపండు రసం టమాటాలోని పులుపును బ్యాలెన్స్ చేస్తాయి. వేడివేడి అన్నంలో ఈ మసాలా గ్రేవీ కలుపుకుని, ఆ ఉడికిన టమాటాను నంచుకుని తింటే ఆ మజానే వేరు! మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు.

Follow Us