మెరిసే చర్మం, ఒత్తైన కురుల కోసం ఆడవారు తప్పక తినాల్సిన గింజలు..అందంతో పాటు ఆరోగ్యం

Updated on: Jan 30, 2025 | 3:59 PM

గుమ్మడి గింజలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని మనందరికీ తెలిసిందే. కానీ గుమ్మడి గింజలు జుట్టు, చర్మానికి కూడా చాలా మేలు చేస్తుందని మీకు తెలుసా. గుమ్మడి గింజలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. గుమ్మడికాయ గింజల కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు, అందం కోసం గుమ్మడి గింజలను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
గుమ్మడి గింజల్లో ఐరన్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా, మెరిసేలా చేస్తాయి. గుమ్మడి గింజల నూనెతో తలకు మసాజ్ చేయటం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలను నివారిస్తుంది.

2 / 5
గుమ్మడి గింజల్లో విటమిన్-ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్నాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి. అలాగే, ఇది పొడి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. గుమ్మడి గింజలు, పెరుగుతో కలిపి పేస్ట్‌ను తయారు చేసి స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు.

3 / 5
గుమ్మడి గింజల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి మొటిమలు, మొటిమల వల్ల ఏర్పడే మచ్చల సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. గుమ్మడి గింజలు, ఓట్‌మీల్‌ను పేస్ట్‌గా చేసి ఫేస్‌మాస్క్‌గా ఉపయోగించండి. మంచి ఫలితం చూస్తారు.

4 / 5
గుమ్మడి గింజలు పిల్లలకు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది కడుపు నొప్పికి, విరేచనాలకు దారితీస్తుంది. అంతేకాదు, అవి పిల్లల్లో ఊపిరితిత్తుల్లో చిక్కుకుపోయే అవకాశం ఉంది. గుమ్మడి గింజలు స్మూతీలు, సలాడ్లలో కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

5 / 5
గుమ్మడి గింజల్లో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే సామర్థ్యం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ విత్తనాలలో పుష్కలంగా ఉండే జింక్ అనే ఖనిజం కొల్లాజెన్ సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది. కొల్లాజెన్ చర్మానికి బలాన్నిస్తుంది. సాగే గుణాన్ని తగ్గిస్తుంది. దీంతో మీరు మెరిసే చర్మంతో యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.